MoviesPSPK 28: ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌’గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..కేక పుట్టిస్తున్న టైటిల్...

PSPK 28: ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌’గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..కేక పుట్టిస్తున్న టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్..!!

వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే భీమ్లా నాయ‌క్ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసిన ప‌వ‌న్ త్వ‌ర‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొన‌నున్నాడు.

పవర్ ఫుల్ కాంబినేష: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హారిష్ శంకర్ ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రీపీట్ అవుతుందడంతో… అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు.

తాజాగా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలింది చిత్రబృందం. పవన్ కెరీర్‌లో తెరకెక్కుతున్న 28వ చిత్రానికి ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.తాజాగా విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పుడే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. భగత్ సింగ్ అంటే రెబల్, భవదీయుడు అనే పదంలో ఓ రకమైన వినమ్రత, సౌమ్యం కనిపిస్తోంది.

ఈ రెండూ కలిపి టైటిల్ గా మార్చేశారు మేక‌ర్స్. టైటిల్ అభిమానుల‌కి పిచ్చిపిచ్చిగా న‌చ్చేసింది. ఇక ఫ‌స్ట్ లుక్‌లో ప‌వ‌న్ బైక్‌పై కూర్చొని టీ తాగుతూ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. గతంలో పవర్ స్టార్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘భీంలా నాయక్’, ‘హరి హర వీరమల్లు’ చిత్రాలతో సెట్స్ మీదున్నాయి.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news