Moviesదిమ్మతిరిగే షాకిచ్చిన నందమూరి హీరో..బాలయ్య సంచలన నిర్ణయం..?

దిమ్మతిరిగే షాకిచ్చిన నందమూరి హీరో..బాలయ్య సంచలన నిర్ణయం..?

నందమూరి నట సింహం బాల కృష్ణ.. ఈ పేరుకి టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. నందమూరి తారక రామారావు వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి టాప్ హీరోగా కొనసాగుతున్న బాలయ్యకి కోట్లల్లో అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. మూకు సూటిగా మాట్లాడడం ఈయనకు అలవాటు. ఎదుటి వారు ఎంతటి వారైన సరే.. తప్పు చేస్తే మొహానే అరుస్తారు..అదే మంచి పని చేస్తే పోగుడుతారు. అందుకే ఆయన అరిచినా ఆయన అభిమానులు అది ఆశీర్వాదంగానే తీసుకుంటారు.

ఇక ఈయనకు సంబదించిన ప్రతివార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంటుంది. స్టేజిపై బాలయ్య మాట్లాడే మాటలు, అభిమానులపై చెంపదెబ్బలు, పవర్ ఫుల్ డైలాగులా మీమ్స్, ఇలా బాలయ్యకి సోషల్ మీడియాలో మంచి క్రేజే ఉంది. అలాగే బాలయ్య పర్సనల్ మ్యాటర్స్ కూడా తెలుసుకోడానికి ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బాలయ్య బాబు సినిమాలలో లేదా బయట ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా విగ్ ధరిస్తారనే టాక్ ఉంది. అయితే ఈ విగ్గుల విషయంలో బాలకృష్ణ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వర్ల్ అవుతుంది. ఇకపై బాలకృష్ణ నటించిబోయే ఏ సినిమా కూడా విగ్గు లేకుండ నటించాలన్న నిర్ణయాన్ని బాలయ్య బాబు తీసుకున్నట్లు సమాచారం. సినిమాలలో విగ్గు లేకుండా సహజంగా నటించడం కోసం బాలకృష్ణ ఇప్పటినుంచి బయటికి ఎక్కడికి వెళ్ళినా విగ్గు లేకుండా వెళ్తున్నారట.

 

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే..యువరత్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ‌ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. ఈ సినిమా పూర్తయిన వెంటనే క్రాక్‌ సినిమా దర్శకుడు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేసేందుకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య తో సినిమాలు చేసేందుకు అనిల్ రావిపూడి, శ్రీ వాస్‌ కూడా లైన్లో ఉన్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news