Moviesస్ట్రిక్ట్ కండీషన్స్ పెట్టిన లావణ్య.. తిక్కరేగి ఆ సినిమా నుండి తీసేసిన...

స్ట్రిక్ట్ కండీషన్స్ పెట్టిన లావణ్య.. తిక్కరేగి ఆ సినిమా నుండి తీసేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్..?

లావణ్య త్రిపాఠి.. ఈ అందాల రాక్షసి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనిపిస్తుంది. ఆమె గ్లామర్ అలాంటిది మరి. తన నవ్వుతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడ్డేసిన ఈ చిన్నది..చేసింది తక్కువ సినిమాలె అయినా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొతం చేసుకుంది. మంచి సెలెక్టెడ్ స్టోరీస్ ఎంపిక చేసుకుని..కెరీర్ ని ముందుకు కొనసాగిస్తుంది.

నాని మారుతి కాంబినేషన్‌లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా మాత్రం ఈ అమ్మడుకి మంచి పేరు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన నటనతో అందరిని మెప్పించి..మంచి మార్కులు వేయించుకుంది. లావణ్య త్రిపాఠి తెరపై ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతకు అమ్మడు ఆమడ దూరంలో ఉంటారు. అయితే టాలీవుడ్ సేన్సేషనల్ హిట్ గీతగోవిందం..సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే మొదట ఈ సినిమలో లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా ఎంపిక చేసారట. అయితే, ఆమె ఈ సినిమాలో నటించడానికి కొన్ని కండీషన్స్ పెట్టారట. ముఖ్యంగా బస్ లో విజయ్ ముద్దు పెట్టే సీన్ లో కొన్ని మార్పులు చేయాలని చెప్పిందట. అంతేనా..ఇంకా రెమ్యునరేషన్ కూడా విజయ్ దేవరకొండాకి సరి సమానంగా ఉండాలని డిమాండ్ చేసిందట, దీంతో డైరెక్టర్ ఇన్ని తతంగాలు నేను పడలేనులే అని ఆమెను ఈ సినిమానుండి తప్పిచేసారట. దీంతో మంచి బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుంది ఈ వయ్యరి భామ.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news