Moviesఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన హీరో కృష్ణుడు అరెస్ట్..ఇన్ఫర్మేషన్ లీక్...

ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన హీరో కృష్ణుడు అరెస్ట్..ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది ఎవరో తెలుసా..??

సినీ నటుడు కృష్ణుడు అరెస్ట్ అయ్యాడు. ఈ వార్తతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ షాక్ కి గురైంది. టాలీవుడ్ సినిమా నటుడు ఆ.కృష్ణం అలియాస్ హీరో కృష్ణుడుని పోలీసులు అరెస్ట్ చేసారనే వార్త ప్రతుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రముఖుల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం..ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మియాపూర్ పోలీసులు పక్క ప్లాన్ వేసి.. పేకాట ఆడే వారిని పట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ లిస్ట్ లో ఉన్న మొతం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజుకూడా అరెస్త్ అయ్యారట. శుక్రవారం అర్థరాత్రి పేకాట స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు..ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు.

టాలీవుడ్ ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన కృష్ణుడు ‘వినాయకుడు’ సినిమాలో హీరోగా నటించి మంచి పేరు సంపాఇంచుకున్నారు. హీరో, కమెడియన్, ఆర్టిస్ట్ అయిన కృష్ణుడు ఎప్పుడూ కూడా వివాదాలతో వార్తల్లోకెక్కడం ఇదేమి మొదటిసారి కాదు. ఆ మధ్య ఓ లేడీ చేసిన ఆరోపణలతో నెట్టింట్లో వైరల్ అయ్యారు. ఇక ఇప్పుడు పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని శిల్పాపార్క్ విల్లా లో పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు నటుడు కృష్ణుడుని అదుపులోకి తీసుకున్నారు.

కాగా నటుడు కృష్ణుడు.. తెలుగు చిత్ర పరిశ్రమలో.. కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విలేజ్‌లో వినాయకుడు, హ్యాపీడేస్, యువత, షాక్, ఆర్య2, స్నేహగీతం, జ్యోతి లక్ష్మి తదితర సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా ఆయన ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news