Moviesఅమితాబ్ ని ఏడిపించిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..??

అమితాబ్ ని ఏడిపించిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..??

అమితాబ్ బచ్చన్..బాలివుడ్ లెజండరి యాక్టర్. ఈయనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని బాలీవుడ్ లో ఎందరో హీరొలు తెరంగేట్రం చేసారు. ఈయన యాక్టింగ్ స్కిల్స్ కు ఫిదా అవ్వని వారంటూ ఉండరేమో అనడంలో ఆశ్చర్య లేదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ..మరోవైపు ప‌లు టీవీ షోల‌లోను పాల్గొంటున్నారు. అయితే తాగాగా ఓ సినిమాలోని సాంగ్ విని ఏడ్చేశార‌ట‌. ఈ విషయాని స్వయంగా ఆయన తన పర్సనల్ బ్లాగ్ లో రాసుకొచ్చారు.

నిజానికి ఆయ‌న కెరీర్‌లో ఎన్నో కష్టాలు,ఒడిదుడుకులు..ఎత్తులు పై ఎత్తులు చ‌వి చూసుంతారు. రీల్‌ కి, రియాలిటీ కి మ‌ధ్య ఉండే తేడా ఏంటో ఆయ‌న‌కు బాగా తెలుసు. అలాంటిది ఆయన ఓ సినిమా పాత చూసి ఏడ్చేసారు. ఇంతకి ఆ పాట ఏంటో తెలుసా..?? తమిళ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన సూర్య నటించిన ఆకాశం నీ హద్దు రా లోని ‘కయిలే ఆకాశం’(కయ్యిలే ఆగాశమ్‌.. కొండు వంద ఉన్‌ పాసమ్‌) అనే పాట.

యస్..అదే పాట..తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగ అనుభూతిని కలిగించింది అని బిగ్ బి పర్సనల్ బ్లాగ్ లో పోస్ట్ చేసారు. ఒక్కోసారి మ‌నం ఊహించిన దానికి మించి కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయ‌ని, అలాంటి సంఘ‌ట‌నే త‌న‌కు ఎదురైంద‌ని బిగ్ బీ త‌న బ్లాగ్‌లో రాశారు. తాను ఆకాశం నీ హద్దు రా లోని ‘కయిలే ఆకాశం’ (కయ్యిలే ఆగాశమ్‌.. కొండు వంద ఉన్‌ పాసమ్‌) అనే పాట విన్న‌ప్పుడు త‌న‌ కన్నీళ్లను ఆపుకోవడానికి ఎంత ప్రయత్నించినా త‌న వల్ల కాలేద‌ని పేర్కొన్నారు.

 

అమితాబ్ స్పందనకు సూర్యకు చెందిన 2డి ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ స్పందిస్తూ మీరు చాలా దయ కలవారు సీనియర్ బచ్చన్ సర్ అని కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది. సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకు అటు విమర్శకుల ప్రశంసలతో పాటు ఇటు ప్రేక్షకుల ఆదరణ కూడా లభించింది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లోనూ రీమేక్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news