Moviesషాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్...

షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా..??

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే నాలుగు సీజన్ లు మంచి విజయవంతంగా పూర్తవగా ఇటీవలే సీజన్ ఫైవ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. చాలా వరకు అందరూ పరిచయమున్న సెలబ్రిటీలే కాగా.. ఇక మరికొందరి గురించి తెగ సర్చ్ లు చేస్తున్నారు ప్రేక్షకులు. మునుపెన్నడూ లేనంతగా 5మచ్ సందడితో రెండో రోజు నుంచే అలకలు, ఏడుపులు, గొడవలు మొదలయ్యాయి. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గొడవలు అన్నీ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి.

బిగ్ బాస్ సీజన్ 5 తొలి వారం నామినేషన్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. యాంకర్ రవి, హమీద, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, మానస్, సరయులు ఈ నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు.. తొలివారంలోనే వెనుతిరిగేది ఎవరు అనే ఉత్కంఠ బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఉంది. అయితే ఓటింగ్ విషయంలో ఎప్పుడూ ఉండే రచ్చే ఈసారి కూడా కనిపిస్తుంది. ఎలాగూ ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయి? హయ్యెస్ట్ ఓటింగ్ ఎవరికి వచ్చింది..? లీస్ట్ ఓటింగ్ ఎవరికి అనే లెక్కలు చెప్పనుగాక చెప్పరు

ఇక ఇందులో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు బాగా వైరల్ గా మారింది. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు మోడల్ జశ్వంత్ అని తెలుస్తుంది. మొదట్లో చాలా సైలెంట్ గా .. అమాయకుడని అనిపించుకున్న ఈయన. కానీ మరో కంటెస్టెంట్ అనీ మాస్టర్ తో బాగా రెచ్చిపోయాడు. జెస్సీ అనగా జశ్వంత్ 2018లో సూపర్ మోడల్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. మొదట్లో కొంచెం సెన్సిటివ్, ఇన్నోసెంట్‌గా కనిపించిన జెస్సీ.. ఆ తర్వాత తనలోని షేడ్స్ అన్నింటిని ఒక్కొక్కటిగా బయటికి చూపిస్తున్నాడని నెటిజన్లు నెట్టింట కామెంట్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news