Moviesరీజనబుల్ రీజన్ తో ..రాజమౌళిని లాగి పెట్టి కొట్టిన ఒకే ఒక...

రీజనబుల్ రీజన్ తో ..రాజమౌళిని లాగి పెట్టి కొట్టిన ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా..?

దర్శక బాహుబలిగా పేరు పొంది ప్రపంచ వ్యాప్తంగా క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన ఎస్ ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా క్రెడిట్ ని ఎవరికి అందనమత ఆకాశానికి ఎత్తేసి ప్రపంచవ్యాప్తంగా ఒక్క బాహుబలి అనే పేరుతో సంచలనం సృష్టించిన దర్శకుడు ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా మార్కెట్ ఈ రోజు ఖండాంతరాల లో వ్యాప్తి చెందింది అంటే అది కేవలం రాజమౌళి వల్లనే అనేది జగమేరిగిన సత్యం. సినిమాలు ఎవరైనా తీస్తారు.. కానీ ప్రజలకు నచ్చే విధంగా..వాళ్ళు మెచ్చే విధంగా తీయడమే రాజమౌళి స్పెషాలిటి.

అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళికి పేరుంది. అయన ఒక్కో సినిమాని ఓ శిల్పం లాగా చెక్కుతారు అందుకే అయనకి జక్కన్న అని పేరుంది. ప‌ర్‌ఫెక్షన్ కోసం ఎన్ని షాట్స్ అయిన తీస్తారు.. ఒక్కో సినిమాకి ఎన్నో సంవత్సరాలు కేటాయిస్తారు అందుకే టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్ లో ఇప్పుడు రాజమౌళి ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇంత మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళిని రైటర్ విజయేంద్రప్రసాద్..అదేనండి రాజమౌళి తండ్రి.. లాగి పెట్టి కొట్టారట. అప్పుడు రాజమౌళి గుక్కపట్టి ఏద్చేసారట. ఇమతకి ఆయన రాజమౌళిని ఎందుకు కొట్టారో తెలుసా..?

చిన్నప్పుడు రాజమౌళి ఆడుకుంటూ వరుసగా వెళ్తున్న చీమలన్నింటిని ఒక్కొక్కటిని నలిపి చంపేస్తున్నాడప్పౌడు.. విజయేంద్రప్రసాద్ రాజమౌళి లాగి పెట్టి కొట్టాడట.ఇక రాజమౌళి గట్టిగా ఏడవడంతో..ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ..నొప్పిగా ఉంది నాన్న అని చెప్పిన్నప్పుడు.. అసలు నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా..?? నిన్ను ఒక్కదెబ్బ కొట్టగానే నొప్పితో ఇంతలా ఏడుస్తున్నావు కదా.. మరి నువ్వు ఆ చీమలను నలిపి చంపేస్తున్నప్పుడు అది ఎంత బాధపడి ఉంటాయో తెలుసా అంటూ తన కొడుకు అర్థమయ్యే విధంగా వివరించాడు. ఇక ఈ ఒక్క విషయంతో విజయేంద్ర ప్రసాద్ లోని గుణాలకు అద్దం పట్టడమే కాకుండా ఇతరులతో ఏ విధంగా మెలగాలన్న విషయాలను కూడా విజయేంద్రప్రసాద్ రాజమౌళికి ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఎంతో క్రమశిక్షణగా పెంచారని చెప్పవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news