Gossipsబిగ్ బాస్ లోకి వెళ్లబోయే జంట ఇదే.. పక్కా..ఇదిగో ప్రూఫ్..??

బిగ్ బాస్ లోకి వెళ్లబోయే జంట ఇదే.. పక్కా..ఇదిగో ప్రూఫ్..??

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్‌బాస్ ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా నాలుగు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. అయితే, ప్రేక్షకులు ఎప్పుడేప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 అతి త్వరలోనే మనముందుకు రానుంది. దీనికి సంబంధించి స్టార్ మా ఓ అదిదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. త్వరలో మీ అందరిని పలకరించేందుకు ముందు వస్తున్నామంటూ అధికారికంగా స్టార్ మా లో తెలిపారు షో మేకర్స్.

స‌లు ఈ బిగ్‌బాస్‌లోకి ఎవ‌రెవ‌రు వ‌స్తారు ? అన్న‌దానిపై ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా నాలుగో సీజ‌న్ త‌ర్వాత బిగ్‌బాస్‌లోకి వెళ్లిన వారికి మంచి పాపులారిటీ వ‌స్తుండ‌డంతో ఐదో సీజ‌న్లోకి వెళ్లేందుకు బుల్లితెర సెల‌బ్రిటీలు, సినిమాల్లో అవుట్ డేటెడ్ అయిన వాళ్లు చాలా మంది ఉత్సాహంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో బిగ్‌బాస్ ఐదో సీజన్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మీడియం రేంజ్ యాంక‌ర్లు, చిన్నా చిత‌కా యాంక‌ర్లే కాదు టాప్ యాంక‌ర్లు సైతం త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేస్తున్నార‌ట‌.

ఇదిలాఉంటే ఈ సీజన్‌లో కంటెస్టెంట్ ఎవరన్న ఆసక్తి అందర్లోనూ ఉండగా.. అనేక పేర్లు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రొమాంటిక్ జంటను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపుతున్నట్టు సమాచారం. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న శ్రీహాన్-సిరి హనుమంత్ జంటను బిగ్ బాస్ హౌస్‌కి పంపించబోతున్నారని అందరు అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఓ క్రేజీ డ్యాన్స్ కపుల్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నట్లు తెలుస్తుంది.

ఆ జంట ఎవరో కాదు..ఆట సందీప్, ఆయన భార్య జ్యోతి. ఈ జంట బిగ్ బాస్ ఇంట్లోకి రాబోతోన్నారని టాక్. దీనికి తోడు సందీప్ తన ఫేస్ బుక్ స్టోరీలో ..మేమిద్దరం బిగ్ బాస్ షోలో ఉండాలని, చూడాలని ఎంత మంది అనుకుంటున్నారు? అని పోల్ పెట్టాడు. షాకింగ్ ఏమిటంటే.. 83 శాతం మంది వాళ్లిద్దరిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలి అనుకుంటున్నట్లు తెలిపారు. ఇక సందీప్ తాజాగా ఇచ్చిన హింట్ తో ఈ జంట బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ పక్కా అని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news