Movies“వర్షం” సినిమాలో నటించిన ఈ బుడోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడొ తెలుసా..అసలు...

“వర్షం” సినిమాలో నటించిన ఈ బుడోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడొ తెలుసా..అసలు నమ్మలేరు ..??

ఈ రంగుల ప్రపంచం సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయ లోకం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నేడు స్టార్స్ గా ఉన్న హీరోలు జీరో అవుతారు. జీరో గా ఉన్న హీరోయిన్స్ టాప్ లిస్ట్ లో చేరుతారు. ఇక డైరెక్టర్ లు , ప్రోడ్యుసర్స్ విషయాలు చెప్పనవసరం లేదు. స్టాక్ మార్కెట్ లాగా ఎప్పుడు ఎవరు పైకి వస్తారో.. ఎప్పుడు ఎవరు కిందకి పడిపోతారో ఆ దెవుడికే తెలియాలి. ఇక సినీ ఇండస్ట్రీలో చిన్నప్పుడు తమ సినిమా కెరీర్ ని మొదలు పెట్టి తరువాత యాక్టర్లుగా పరిచయమైన హీరోస్ ,హీరోయిన్స్ చాల మందే ఉన్నారు.అలా తమకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా ఉన్నారు. కానీ కొంత మంది చిన్నప్పుడు సినిమాలో నటించి..ఆ తరువాత తెరకు దూరమైన నటుల్లో ఈ అక్షయ్ కూడా ఒక్కరు.

ఏంటి అక్షయ్ అంటే ఎవరా.. అనుకుంటున్నారా..?? అదేనండి. సంతోషం సినిమాలో నాగార్జున కొడుకు గా, వర్షం సినిమాలో ప్రభాస్ మేనల్లుడిగా నటించాడే ఆ బుడోడు పేరు అక్షయ్. 1997 మే 19వ తేదీన జన్మించిన అక్షయ్ బచ్చు 12 సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా నటించాడు. బ్రిటానియా గుడ్ డే బిస్కెట్స్, మ్యాగీ, డెటాల్, వంటి 40 ప్రముఖ సంస్థల వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపించాడు.

తెలుగులోనే కాకుండా హిందీలో కూడా పలు సినిమాల్లోనూ, సీరియల్స్ లోనూ, టీవి యాడ్స్ లోనూ నటించాడు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పోకిరి సినిమాని హిందీలో వాంటెడ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించగా, సల్మాన్ ఖాన్ హీరోగా, అయేషా టకియా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో అక్షయ్, అయేషా తమ్ముడిగా నటించాడు.

అక్షయ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నాడు. ఆన్ మై కే రోల్ అనే ఒక కాస్టింగ్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. అంతే కాదు ఇతను ప్రజెంట్ ముంబయిలో నివసిస్తున్న కూడా ఇతను హోమ్ టౌన్ మాత్రం ఆంధ్రప్రదేశ్. సో మిగతా చైల్డ్ ఆర్టిస్ట్ లాగానే అక్షయ్ కూడా మళ్ళీ హీరోగా గానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కానీ మళ్ళీ తెలుగు సినిమాల్లోకి అడుగు పెడతాడేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news