Moviesఅల్లు అర్జున్ టోటల్ కెరీర్ లోనే ఈ సినిమాకు ఓ స్పెషాలిటి...

అల్లు అర్జున్ టోటల్ కెరీర్ లోనే ఈ సినిమాకు ఓ స్పెషాలిటి ఉంది..ఏంటో తెలుసా..??

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఇండ‌స్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని టాప్ హీరోగా దూసుకు పోతున్నాడు. ఇంకా చెప్పాలంటే అల వైకుంఠ‌పురంలో సినిమా త‌ర్వాత యంగ్ హీరోలలో బ‌న్నీయే నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉన్నాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌నోడి క్రేజ్ అల వైకుంఠ‌పురంలో త‌ర్వాత డ‌బుల్ అయ్యింది. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు సౌత్‌లో పాపుల‌ర్ హీరో అయిపోయాడు. గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు తెలుగులో మాత్ర‌మే కాకుండా మ‌ళయాళం, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అల్లు అర్జున్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ ప‌రంగా అతి త‌క్కువ టైంలోనే సూప‌ర్ హిట్ల‌తో ఓ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠపురంలో ఘన విజయాన్ని సాధించి ఎన్నో రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే పుష్ప సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాలో అల్లు అర్జున్ న‌టిస్తాడు.

ఐకాన్ స్టార్ గా మారిపోయిన బన్నీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా ఏంటో తెలుసా..??.. ఆ సినిమానే “జులాయి”. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి పంచు డైలాగులు , ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కథ పరంగా స్టోరీ లేకపోయినా దాదాపుగా 40 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా లాభాల వర్షం కురిపించిందంటే..ఈ సినిమా ని ప్రేక్షకులు ఎంత గా ఆదరించారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్లస్. ఈ సినిమా బ‌న్నీ – త్రివిక్ర‌మ్ హిట్ కాంబినేష‌న్లో కూడా తొలి సినిమా కావడం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news