Gossipsఒక్కసారి అలా చేస్తే కోడలు పిల్ల ..ఎంత తీసుకుంటుందో తెలుసా.. దిమ్మ...

ఒక్కసారి అలా చేస్తే కోడలు పిల్ల ..ఎంత తీసుకుంటుందో తెలుసా.. దిమ్మ తిరిగిపోవాల్సిందే..?

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఉన్న సమంతకు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. సినీ ఇండస్ట్రీని ఏలేసి..ఆ తరువాత అక్కినేని వారింట కోదలిగా అడుగుపెట్టింది సమంత. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్యను పెళ్లాడిన ఆమె మ్యారేజ్ తర్వాత అక్కినేని అనే బ్రాండ్‌తో మరింత పాపులారిటి పెమొచుకుని తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. అక్కినేని కోడలిగా మారినా తర్వాత సమంతకు మరింత క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు.

అయితే స్టార్ హీరోయిన్ అయిన సమంత చైతుని పెళ్లాడటం వల్ల అతని ఇమేజ్ కూడా పెరిగింది. అయితే పెళ్లి తర్వాత సమంత తన పంథా మార్చేసింది. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. యూటర్న్, ఓ బేబీ సినిమాలు ఆ కోవలో వచ్చినవే. సినిమాలు ఒక్కటే కాదండోయ్.. వ్యాపారాలు, ఫ్యాషన్ ఇలా అన్నింటా నేనే నెం.1 అంటూ ముందన్నట్లుగా హవా నడిపిస్తోంది ఈ అక్కినేని కోడలు పిల్ల. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత తనకు నచ్చినట్లుగా ఉంటూ అక్కినేని కోడలి రూటే సపరేటు అనిపించుకుంటోంది.

అక్కినేని కోడలు పిల్ల సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఫ్రీ టైం దొరికిన ప్రతిసారి భర్త నాగ చైతన్యతో రొమాంటిక్ టూర్స్ వేస్తూ .. ఆయా ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంసి సాం. ఇక ఈమె ఇంస్టా గ్రామ్ కి దాదాపు 18మిలియన్స్ మంది ఫాలోయర్స్ ఉన్నారంటే ఈమె రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి. మరి ఇంతటి భారీ ఫాలోయింగ్ ఉన్న ఈమె సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా..??. ఈమె పెడుతున్న ఒక్కో పోస్టుకి 25నుంచి 30లక్షలు అందుకుంటోందట. అంతలా ప్రోడక్ట్స్ కి తన సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా ప్రచారం కల్పిస్తోంది ఈ అక్కినేని కోడలు పిల్ల..సమంత దీని ద్వారా కూడా బాగానే కూడబెడుతోందని టాక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news