Gossipsఅబ్బే..ఆ పాత్రకు స్వీటీ అసలు సెట్ అవ్వద్దు..నయన్ నే పర్ ఫెక్ట్...??

అబ్బే..ఆ పాత్రకు స్వీటీ అసలు సెట్ అవ్వద్దు..నయన్ నే పర్ ఫెక్ట్…??

నయనతార.. లేడి అమితాబ్. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా నయనతార కొనసాగుతోంది. సౌత్ క్వీన్ గా… లేడి అమితాబ్ గా నయనతార గుర్తింపు తెచ్చుకుంది. నయనతార కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనపరంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా అంచెలంచలుగా ఎదుగుతూ వస్తున్న భామ నయనతార కోలీవుడ్ లో ఆమె సినిమా అంటే అక్కడ స్టర్ హీరోలు కూడా భయపడే పరిస్థితి ఉంది.

కంటెంట్ ఉన్న సినిమాలతో తమిళనాట సంచలన విజయాలను అందుకుంటున్న నయనతార ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉందని చెప్పొచ్చు. ఏ హీరోయిన్ కూడా చేయని ప్రయోగాలతో నయన్ సినిమాలు చేస్తుంది. కుర్రకారులో నయనతారకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తెలుగులో కూడా సీనియర్ స్టార్స్ కు ఆమె బెటర్ ఆప్షన్ అయ్యింది. అందుకే ఇక్కడ అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది అమ్మడు.

నయనతార నటించిన లేటెస్ట్ మూవీ నెట్రికన్.,, ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా నయనతార యాక్షన్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. అతితే ఇప్పుడు ఇదే సినిమాని తెలుగులోకి రీమేక్ చేస్తున్నట్లు వార్తలి వినిపిస్తున్నాయి. అయితే తెలుగు వర్షేన్ లో మాత్ర, హీరోయిన్ నయన తార కాదట.. ఈ సినిమాలో అనుష్క సెట్టి ని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

అనుష్క ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తే మంచి విజయం సాధిస్తుందని టాక్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్స్ భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఏమో ఈ సినిమాకి అనుష్క అసలు సెట్ అవ్వద్దు..ఆమెకు అంత సీన్ లేదు అంటుంటే.. మరి కొంత మంది తెలుగులోకూడా నయన్ చేస్తేనే బాగుంటాది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news