Moviesప్రభాస్ కు బిగ్ షాక్ .. సలార్ నుంచి సెన్సేషనల్ ...

ప్రభాస్ కు బిగ్ షాక్ .. సలార్ నుంచి సెన్సేషనల్ వీడియో లీక్..!!

డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాబోతున్న మరో భారీ సినిమా ‘సలార్’. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శ్రుతి హసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని టాక్. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇందులో ప్రభాస్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ..సలార్ టీంకు భారీ షాక్ తగ్గిలింది.

సలార్ సెట్స్ నుండి ప్రభాస్ వీడియో, కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. గతంలో ఫస్ట్ షెడ్యూల్ లో మైన్స్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో లొకేషన్ నుంచి ప్రభాస్ లుక్ లీకై మేకర్స్ కి షాకిచ్చింది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ కి సంబంధించిన చిన్న వీడియో లీకై మేకర్స్ కంగారు పెడుతుంది. ఇక వీడియోలో షూటింగ్ లొకేషన్ లో ప్రభాస్ నడుస్తూ కన్పించాడు. ఆ వీడియో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం మేకర్స్ ఓ మాస్ సాంగ్ ను షూట్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇకపై నుంచైనా మేకర్స్ కఠినంగా వ్యవహరించి ఏ లీకులు రాకుండా ఉంటాయేమో చూడాలి .

 

ఇక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియన్‌ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘సలార్’ మూవీ కోసం ప్రభాస్ బాహుబలి ఫార్ములాను రిపీట్ చేస్తున్నాడంటున్నాయి టాలీవుడ్ సన్నిహిత వర్గాలు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీని రెండు పార్టులు తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. కథా విస్తృతి దృష్ట్యా పార్ట్‌-1, పార్ట్‌-2లుగా తెరకెక్కిస్తేనే బాగుంటుందనే ఆలోచనలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఉన్నట్లు టాలీవుడ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news