Moviesవిజయశాంతికి లేడి అమితాబ్ గా పేరు తెచ్చిన సినిమా ఇదే..!!

విజయశాంతికి లేడి అమితాబ్ గా పేరు తెచ్చిన సినిమా ఇదే..!!

విజయశాంతి తెలుగు చిత్రసీమకు లేడీ సూపర్ స్టార్. తన యాక్షన్‌తో స్ట్రీట్ ఫైటర్ అవతారమెత్తిన మగరాయుడు. భారత నారిగా తన కర్తవ్యం నెరవెర్చిన పెంకిపెళ్లాం కూడా. గ్లామర్ కి గ్రామర్ నేర్పిన లేడీబాస్. ఒసేయ్ రాములమ్మ గా దుర్మార్గులను ప్రతిఘటించిన అరుణ కిరణం. తన నటనతో ఒక హిస్టరిని క్రియేట్ చేసిన ఆ పేరు విజయశాంతి. విజయశాంతి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 ఏండ్లు దాటింది. తెలుగులో హీరోయిన్ గా ఫస్ట్ మూవీ కృష్ణ హీరోగా నటించిన ‘కిలాడీ కృష్టుడు. విజయనిర్మల దర్శకత్వం వహించారు. 1980లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

విజయశాంతి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుసగా గ్లామర్ పాత్రల్లో నటించి మెప్పించారు. అప్పట్లో ఎన్టీయార్, ఏయెన్నార్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘సత్యం – శివం’లో నటించారు. అప్పటికి ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించారు ఆమె. అయితే విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన నేటి భారతం. ఆ సినిమా సంచలన విజయం అందుకోవడంతో విజయశాంతికి సూపర్ క్రేజ్ దక్కింది.

ఆ తరువాత హీరోయిన్ గా ఎవ్వరు చేరుకోలేని స్థాయికి చేరుకుని సౌత్ ఇండియాలోనే లేడీ సూపర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ అందుకున్నారు. హీరోయిన్‌గా గ్లామర్ పాత్రలతో ఆకట్టుకుని స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో సడన్‌గా ట్రెండ్ మర్చి .. ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కమర్షియల్ హీరోలకు ధీటుగా యాక్షన్ సన్నివేశాలు చేయడమే కాదు అదే రేంజ్‌లో స్టార్ హీరోల సినిమాలకు సమానంగా వసూళ్లను అందుకున్నారు విజయశాంతి.

రెండు దశాబ్దాల పాటు లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి… మహిళా ప్రధాన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌తోపాటు సొంతం చేసుకున్నారు. విజయశాంతి సినిమాలు స్టార్‌హీరోలతో సమానంగా బాక్సాపీస్‌ వద్ద పోటీ పడేవి. అంటే.. విజయశాంతి స్టార్‌డమ్‌ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. విజయశాంతి సినిమాల ముందు స్టార్ హీరోల సినిమాలు సైతం ఆడేవి కాదు.. హీరోలతో సమానంగా ఇంకా చెప్పాలంటే.. హీరోలకు మించి రెమ్యునరేషన్ తీసుకునేది.

1990లో మోహన గాంధీ దర్శకత్వంలో సూర్య మూవీస్ పతాకంపై నిర్మించిన కర్తవ్యం చిత్రంతో తనలోని మరో కోణాన్ని పరిచయం చేశారు. విజయశాంతి, వినోద్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఓ నిజాయితీగల పోలీస్ అధికారిణి అంగ బలం, అర్ద బలం కలిగిన అవినీతిపరులను, రౌడీలను, గుండాలను ఎలా ఎదుర్కున్నది అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఆ చిత్రంలో వైజయంతిగా విజయశాంతి కనబరిచిన నటనకు హీరోలు సైతం ముగ్ధులయ్యారు. అప్పట్నుంచే ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం ప్రారంభించారు విజయశాంతి. హీరోలకు సమానంగా తన మార్కెట్ ను ఈ సినిమాతో పెంచుకున్నారు.

దాదాపు 90 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఏకంగా 7 కోట్ల కలెక్షన్లను సాధించింది. విజయశాంతి ఈ సినిమా ద్వారా నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నారు. తమిళ, హిందీ భాషల్లోకి కూడా డబ్ అయిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఏమైనా పోలీస్ నేపథ్యమున్న సినిమాలలో తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలు వచ్చినా కూడా కర్తవ్యం ముందువరుసలో ఉంటుంది. ఆ సినిమాతోనే ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఇమేజ్ అందుకోవడమే కాదు లేడి అమితాబ్ గాను సత్తా చాటారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news