Moviesఈ స్టార్ హీరోయిన్ కి వాళ్ళ నాన్న అంటే పరమ అసహ్యం..రోజు...

ఈ స్టార్ హీరోయిన్ కి వాళ్ళ నాన్న అంటే పరమ అసహ్యం..రోజు అలా చెసేవాడట..?

కుష్బూ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మనకు బాగా తెలిసిన వ్యక్తే. ఒకప్పటి స్టార్ హీరోయిన్. ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్ స్క్రీన్. కానీ ఈమె సినిమాలోకి వచ్చాక ఆ పేరును కుష్బూ గా మార్చుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..సినీ ఇండస్ట్రిని ఏలిన నటి కుష్బూ. దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవులు సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయ్యిన ఈమె.. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. చేసిన ప్రతి సినిమాలోను తన అందం. అభినయం,నటన తో ప్రేక్షకులను బాగా ఆకటుకుంది.

సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లోను యాక్ట్ చేసిన ఖుష్బూ..తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొందట. మరీ ముఖ్యంగా కుష్బూ వాళ్ళ నాన్నతో చాలా సమస్యలను ఎదుర్కొంది. ఖుష్బూ వాళ్ళ నాన్న రోజూ ఇంటికి తాగి వచ్చి రచ్చ రచ్చ చేసేవడట. అంతేకాదు.. వాళ్ల బ్రదర్ ని, మమ్మీని బాగా కొట్టేవారట. ఇక ఈమె సినిమాల్లో నటిస్తున్న సమయంలో వాళ్ల నాన్న ఇంట్లో అందరినీ బెదిరించి.. ఆమె సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం.. తాగడానికి తీసుకునేవాడట. అంతేకాకుండా కొన్ని సార్లు అయితే ఏకంగా ఖుష్బూ వాళ్ళ నాన్న ఆమె చేసిన సినిమాలలో రెమ్యూనరేషన్ తీసుకోవడానికి ఏకంగా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేవాడు. ఇవన్నీ చూసి తనకు చాలా బాధేసిందట .

అందుకే వాళ్ళ నాన్న అంటే ఆమెకుకు అసహ్యం అని చాలా ఇంటర్వ్యులో చెప్పారు. అంతేకాదు వాళ్ల నాన్నని కలవడానికి కూడా ఆమె ఇష్టపడరట. ఇక్కడ షాకింగ్ విష్యం ఏమిటంటే.. ఇప్పటికే ఆమె వాళ్ల నాన్నని కలిసి సుమారు 30 సంవత్సరాలు అవుతుందట. సొంత తండ్రినే ఆమె ఇంతలా ఆసహ్యించుకుంటుందంటే.. ఆయన ఈమెను ఎంతలా టార్చర్ చేసుంటారో మన అర్ధంచేసుకోవచ్చు. ఏది ఏమైనా ఇవన్నీ భరించి..కుష్బూ తన టాలెంట్ తో తెలుగులోనే కాకుండా తమిళం లో కూడా వరుస సినిమాలు చేస్తూ అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తమిళ సినీ ప్రేక్షకులు కుష్బూ కి ఏకంగా గుడి కట్టించారు అంటే ఆమెకు తమిళంలో ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తల్లి క్యారెక్టర్లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది కుష్బూ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news