MoviesR.P.Patnaik కెరీర్ నాశనం చేసింది ఆ బడా హీరోనే.. ఏం చేసాడో...

R.P.Patnaik కెరీర్ నాశనం చేసింది ఆ బడా హీరోనే.. ఏం చేసాడో తెలుసా..??

ఆర్ పి పట్నాయక్..ఈ పేరు విని చాలా కాలమే అయినా కూడా అందరికి ఈయన గురించి బాగా తెలుసు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది సంగీత దర్శకులు వస్తుంటారు పోతుంటారు.. వాళలో కొందరి పేర్లు మాత్రమే జనాలకు గుర్తుంటాయి. అలాంటి పాపులర్ వ్యక్తే ఈ ఆర్ పి పట్నాయక్. అయితే కొందరు సంగీత దర్ వేల సినిమాలకు తమ సంగీతాన్ని సమకూర్చిన పెద్దగా పేరు రాదు.. అయితే కొందరు మాత్రం మధురమైన పాటలను కంపోజ్ చేస్తూ.. ప్రేక్షకుల మనసును గెలుచుకుంటారు.

అలా ప్రేక్షకుల మదిలో నిలిచి పోయినా ఆర్ పి పట్నాయక్.. ‘చిత్రం’,శ్రీరామ్,హోలీ, మనసంతా నువ్వే, సంతోషం, నువ్వు నేను’,’జయం’ నీ స్నేహం.. వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతాన్ని అందించి తన స్టెమినా నిరూపించుకున్నాడు. అంతేకాదు మరి కొన్ని పాటలకు స్వరాలను కూడా అందించాడు మన ఆర్ పి పట్నాయక్. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆర్పీ పట్నాయక్ సడెన్‌గా ఇక సంగీతం చేసేది లేదంటూ షాకింగ్ ప్రకటన చేశారు. దీంతో టాలీవుడ్ సంగీత ప్రపంచం షాక్ అయ్యింది. అయితే, ఇలా హఠాత్తుగా సంగీతానికి ఆర్పీ పట్నాయక్ దూరం కావడానికి కారణం ఓ బడా హీరో అట. ఓ స్టార్ హీరోతో విబేధాల వల్లే ఆయన మ్యూజిక్ అందించడం మానేశారని తెలుస్తుంది.

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘నేనున్నాను’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమానే ఆర్పీ ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కారణం. నాగార్జున నటించిన నేనున్నాను మూవీలో సంగీత దర్శకునిగా పనిచేస్తున్నప్పుడు రెండు సాంగ్స్ రికార్డింగ్ కంప్లీట్ అయ్యాక..సడేన్ గా యుఎస్ లో ఓ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వెళ్లారు ఆర్ పి పట్నాయక్.

ఇలా అమెరికా వెళ్తున్నట్లుగానీ.. వెళ్లి వచ్చాక ట్యూన్స్ సంగతి గానీ చూద్దామని చిన్న మాటైనా చెప్పకుండా అమెరికాకు వెళ్లిపోవడం.. ఈ విషయాన్ని ఆర్పీ మేనేజర్ కూడా చిత్ర యూనిట్‌కు చెప్పకపోవడంతో.. ఆయన ఇండియా తిరిగొచ్చేసరికి జరగాల్సింది అంతా జరిగిపోయిందట.

అయితే యుఎస్ నుంచి వచ్చిన ఆర్పీ దగ్గరకు ఇండస్ట్రీలోని ఓ పెద్దాయన వచ్చి ..నీ వలన సినిమా బిజినెస్ మీద ప్రభావం పడుతోందని .. నేనున్నాను మూవీ నుంచి తప్పించేస్తున్నట్లు చెప్పారు. ఇక ఆ తరువాత ఆ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించారు. దాంతో ఇకపై తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో పూర్తిగా సినిమాలకు దూరమైనట్లు స్వయానా చెప్పుకొచ్చాడు ఆర్ పి పట్నాయక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news