Moviesఈమెను హీరోయిన్ కాకుండా ఆపేసింది ఎవరో తెలిస్తే.. అసలు నమ్మలేరు..!!

ఈమెను హీరోయిన్ కాకుండా ఆపేసింది ఎవరో తెలిస్తే.. అసలు నమ్మలేరు..!!

సూపర్ స్టార్ కృష్ణ నటవారసులలో ఆయన కుమార్తె మంజుల ఘట్టమనేని కూడా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని టాలీవుడ్ లో వివిధ రకాల పాత్రలు పోషించింది. ఆమె ఒక నటిగా మాత్రమే కాక నిర్మాతగా, దర్శకురాలిగా కూడా రాణించింది. 1998లో విడుదలైన మలయాళ చిత్రం సమ్మర్ ఇన్ బెత్లెహాం మూవీలో లీడ్ హీరోయిన్స్ లో ఒకరిగా మంజుల నటించారు. ఆ తరువాత రాజస్థాన్ అనే ఓ చిత్రంలో టెర్రరిస్ట్ గా క్యామియో రోల్ చేయడం జరిగింది.

2002లో షో అనే చిత్రాన్ని నిర్మించి నటించారు. ఆ మూవీ జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కించుకోవడం విశేషం.మంచి నిర్మాతగా మరియు మహేష్ బాబు అక్కగా మంజుల గారికి మంచి పేరు ఉంది. అయితే , ఆమె గ‌తంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల‌ని అనుకుంది. అంతేకాదు ఓ స్టార్ హీరో పక్కన ఛాన్స్ కూడా కొట్టేసింది. అంత బాగుంది ఇక సినిమా షూటింగ్ మొదలు పెడతాం అని అనుకునే సరికి..ఆ సినిమా ఆపేసారు. ఆపేసింది ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణా.

అప్పట్లో మంజుల హీరోయిన్ గా చేయడం, కృష్ణ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు.దానికి కారణం వారి అభిమాన నటుడి కూతురు హీరోయిన్ గా గ్లామర్ పాత్రలు చేయడం వారు ఓర్చుకోలేకపోయారు. దీంతో కృష్ణ మంజుల‌ను హీరోయిన్ చేయాల‌న్న అంశాన్ని పూర్తిగాప‌క్క‌న పెట్టేశారు. అయితే మంజుల‌కు హీరోయిన్ అవ్వాల‌న్న కోరిక ఎంత బ‌లంగా ఉన్నా..ఏం చేద్దాం కృష్ణ ఒప్పుకోక‌పోవ‌డంతో ఆ ఆశలు వదిలేసుకుంది. అయితే ఆమెలో ఇంకా నటన మీద కోరిక ఉండి సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news