Gossipsఆ బొద్దు హీరోయిన్ బాల‌య్య‌కు ఓకే చెపుతుందా ?

ఆ బొద్దు హీరోయిన్ బాల‌య్య‌కు ఓకే చెపుతుందా ?

యుర‌వ‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తోన్న బాల‌య్య ఆ వెంట‌నే మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌కత్వంలో మ‌రో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమాకు బాల‌య్య ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఆ త‌ర్వాత క్రిష్ మ‌రోసారి బాల‌య్య‌తో క్రేజీ ప్రాజెక్టును తెర‌కెక్కించాల‌ని చూస్తున్నారు. ఇక బాల‌య్య‌కు క‌థ‌లు చెప్పి ఓకే చేయించుకోవ‌డం వ‌ర‌కు బాగానే ఉంది కాని.. హీరోయిన్ల కొర‌త ఎక్కువుగా ఉంది.

బాల‌య్య ప‌క్క‌న న‌టించేందుకు స‌రైన హీరోయిన్లు సెట్ కావ‌డం లేదు. బాల‌య్య ప్ర‌తి సినిమాకు హీరోయిన్ల‌ను సెట్ చేయ‌డం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఇబ్బందిగానే మారుతోంది. ఇక మ‌లినేని గోపీచంద్ సినిమా కోసం ర‌క‌ర‌కాల పేర్లు వినిపించాయి. శృతీహాస‌న్ – త్రిష్ – మెహ‌రీన్ ఇలా చాలా పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. అయితే ఈ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న వీళ్లెవ్వ‌రు హీరోయిన్లు కాద‌ని తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ బొద్దు హీరోయిన్ సోనాక్షిసిన్హా పేరు వినిపిస్తోంది.

ఈ సినిమా టీం సోనాక్షిని సంప్ర‌దించింద‌ని చెపుతున్నారు. అయితే ఆమె ఈ ప్రాజెక్టును ఓకే చేసేందుకు కొద్ది రోజులు టైం అడిగిన‌ట్టు చెపుతున్నారు. అయితే ఇటీవ‌లే చిరంజీవి కోసం కూడా సోనాక్షిని అడిగితే ఆమె నో చెప్పింద‌ని అంటున్నారు. మ‌రి ఇప్పుడు బాల‌య్య ప్రాజెక్టును అయినా సోనాక్షి ఎంత వ‌ర‌కు ఓకే చేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news