Moviesసినిమాల పిచ్చితో ఈ యంగ్ హీరో ఏం చేసాడో తెలుసా.. చూస్తే...

సినిమాల పిచ్చితో ఈ యంగ్ హీరో ఏం చేసాడో తెలుసా.. చూస్తే అసలు నమ్మలేరు..!!

నిఖిల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు బాగా తెలిసిన వ్యక్తే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చాడు నిఖిల్. ఇక అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హ్యాపీడేస్ చిత్రం నిలిచిపోయింది. ఆ సినిమాలో నలుగురిలో ఒకడుగా ఉన్నా.. ఆ తర్వాత సోలో హీరోగా నటిస్తూ అదరగొడుతున్నాడు. కొత్తదనంతో ఉన్న కథల్నీ ఎంచుకుని విజయాలను అందుకుంటున్నాడు. అందులో భాగంగానే ఆయన హీరోగా వచ్చిన స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ, ‘అర్జున్ సురువరం’ సినిమాలు విజయాన్ని పొందాయి.

ఇప్పటి వరకు హీరోగా నిఖిల్ 17 సినిమాలు చేశారు.అయితే, నిఖిల్ ఇంజినీరింగ్ కంప్లీట్ అయ్యాక గూగుల్ లో మంచి జాబ్ వచ్చిందట. కానీ సినిమాలంటే పిచ్చ ఇషటంతో.. మూవిస్ మీద ఉన్న ఆసక్తితో ఆ జాబ్ వదులుకుని మరీ హ్యాపీ డేస్ సినిమా కోసం ఆడిషన్స్ కి వచ్చారట. ఆలా ఆ ఆడిషన్స్ లో సెలెక్ట్ అవటం.. హ్యాపీ డేస్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం.. మల్లీ వరుసగా ఆఫర్లు రావ్వడంతో..మంచి మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు నిఖిల్.

కాగా ప్రస్తుతం నిఖిల్ తన కెరీర్ లోనే మరో క్రేజ్ సినిమాతో రాబోతున్నాడు. నిఖిల్ హీరోగా సుకుమార్, అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్‌లో ఓ సినిమా రాబోతుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్ ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో చిత్రబృందం చర్చించినట్లు తెలుస్తోంది. సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news