Moviesవెండి తెర పై రెండేళ్లు కనిపించని స్టార్ హీరోలు ఎవరో తెలుసా..??

వెండి తెర పై రెండేళ్లు కనిపించని స్టార్ హీరోలు ఎవరో తెలుసా..??

ఇటీవలకాలంలో మనం చూసినట్లైతే.. ప్రస్తుత హీరోలు ఒక సంవత్సరానికి ఒకటి , మహా అయితే రెండు సినిమాలను విడుదల చేస్తున్నారు. అప్పట్లో హీరోలు.. ఏడాదికి ఐదు, పది అంతకంటే ఎక్కువ సినిమాలు చేసిన సందర్భాలు అనేకం. కానీ ప్రస్తుత తరంలో కథానాయకులు.. సంవత్సరానికి ఒకటి, రెండు చిత్రాలు చేయడం గగనమైపోయింది.

తమ హీరో కొత్త సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తుంటారు అభిమానులు. హీరోలు కూడా తమ అభిమానులను అలరించేందుకు వరుసబెట్టి సినిమాలకు సంతకాలు చేసేస్తుంటారు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు విడుదల చేస్తుంటారు.

అయితే.. టాలీవుడ్‌లో కొంతమంది స్టార్‌ హీరోలు తెరపై కనిపించి ఏడాది దాటింది. ఒక్కొక్కసారి అదే పనిగా ఎక్కువకాలం పని చేస్తే మధ్యలో విరామం కావాలి అనిపిస్తుంది. విరామం తీసుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

అలిసిపోయి అయి ఉండొచ్చు, కొద్ది రోజులు టెన్షన్ అంతా వదిలేసి మళ్లీ రిఫ్రెష్ అయి పని మొదలు పెడదామని అనుకుని ఉండొచ్చు, ఇంకేదైనా కారణం కూడా అయి ఉండొచ్చు. మన హీరోలు కూడా వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల ఎన్నో రోజులు బ్రేక్ తీసుకున్నారు.

తమ అభిమాన హీరోలను తెరపై చూసి తరించేందుకు సినిమా ప్రేమికులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్‌ హీరోల గత సినిమా ఎప్పుడొచ్చింది.. తర్వాత సినిమా ఎప్పుడు రాబోతోంది.. ఈ మధ్య గ్యావ్‌ ఎంత వచ్చిందనేది ఓసారి చూద్దామా..!

 

NTR: గత సినిమా – అరవింద సమేత – విడుదల తేదీ: అక్టోబర్‌.11.2018..రాబోయే సినిమా – ఆర్‌ఆర్‌ఆర్ – విడుదల తేదీ: అక్టోబర్‌‌.13.2021.. విరామం – 3 సంవత్సరాలు

Pawan Kalyan:

జల్సా సినిమా తర్వాత రెండున్నర సంవత్సరాలు గ్యాప్ తీసికొని కొమురం పులి సినిమాని విడుదల చేశాడు పవన్ కళ్యాణ్. ఈ రెండు సినిమాల మధ్య 891 రోజులు గ్యాప్ ఉంది.

KalyanRam:

ఒకప్పుడు వరుస సినిమాలను చేసే కళ్యాణ్ రామ్ 2010 లో వచ్చిన కత్తి సినిమా తర్వాత ఓం 3D సినిమా కోసం 980 రోజులు గ్యాప్ తీసుకున్నాడు.

Prabhas:

2019 లో సాహో సినిమతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ నుండి ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు.ఈ హీరో కూడా రాధే శ్యామ్ తో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నాడు…!!

Mahesh Babu:
గత సినిమా – సరిలేరు నీకెవ్వరు – విడుదల తేదీ: జనవరి.11.2020…రాబోయే సినిమా – సర్కారువారి పాట – విడుదల తేదీ: సంక్రాంతి.2022…విరామం – 2 సంవత్సరాలు…

Venkatesh:
గత సినిమా – వెంకీమామ – విడుదల తేదీ: డిసెంబర్‌‌.13.2019…రాబోయే సినిమా – నారప్ప- విడుదల తేదీ: మే‌.14.2021..రాబోయే సినిమా – నారప్ప- విడుదల తేదీ: మే‌.14.2021..సుమారు: ఏడాదిన్నర…

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news