Moviesకొత్త ఇంటి కోసం చెర్రీతో ఉపాస‌న ఎన్ని కోట్లు పెట్టించిందో తెలుసా..!

కొత్త ఇంటి కోసం చెర్రీతో ఉపాస‌న ఎన్ని కోట్లు పెట్టించిందో తెలుసా..!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం త‌న తండ్రి చిరంజీవి న‌టిస్తోన్న ఆచార్య సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సెకండాఫ్ లో వ‌చ్చే కీల‌క స‌న్నివేశాల్లో చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇక ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాల త‌ర్వాత చ‌ర‌ణ్ వ‌రుస పెట్టి క్రేజీ డైరెక్ట‌ర్ల‌తో క్రేజీ కాంబినేష‌న్లో సినిమాలు చేయ‌నున్నాడు.

ఇదిలా ఉంటే రామ్‌చ‌ర‌ణ్ త‌న భార్య ఉపాస‌న కోరిక తీర్చేందుకు ఏకంగా రు. 38 కోట్లు ఖ‌ర్చు పెట్టాడ‌ట‌. ఉపాస‌న త‌మ కోసం ఓ అదిరిపోయే ఇంటిని నిర్మించుకుందామని చ‌ర‌ణ్‌కు చెప్పింద‌ట‌. దీంతో హైద‌రాబాద్‌లోనే అత్యంత కాస్ట్ లీ ఏరియాగా ఉండే జూబ్లిహిల్స్‌లో చ‌ర‌ణ్ – ఉపాస‌న ప్ర‌త్యేకంగా ఓ ఇంటిని నిర్మించుకున్నారు. దీని కోసం ఏకంగా రు. 38 కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌. ఇందులో వాడిన ఉడ్ ప్ర‌త్యేకంగా ఇట‌లీ నుంచి తెప్పించార‌ట‌.

ఇక వాడిన రాయి అయితే నార్త్‌లో రాజ‌స్థాన్ నుంచి తెప్పించార‌ట‌. లోప‌ల అన్ని అత్యాధునిక హంగుల‌తో ఇంద్ర భ‌వ‌నాన్ని త‌ల‌పించే రేంజ్‌లో ఈ ఇళ్లు ఉంటుంద‌ని.. ఇండ‌స్ట్రీ వాళ్లు చెపుతూ ఉంటారు. ఇక ఈ ఇంట్లో చెర్రీ – ఉపాస‌న మాత్ర‌మే ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news