Moviesహమ్మయ్య..ఈ సినిమాల్లో నటించకుండా అనుష్క చాలా మంచి పని చేసింది..??

హమ్మయ్య..ఈ సినిమాల్లో నటించకుండా అనుష్క చాలా మంచి పని చేసింది..??

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. ప్రత్యేకమైన పాత్రలలో నటిస్తూ మంచి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ గ్లామర్ బ్యూటీ.. బాహుబలి సినిమాలో నటించి గ్లోబల్ స్టార్ గా మారిపోయింది అనుష్క. అలాంటి ఈ అనుష్క ఈ మధ్య సినిమాలకు దూరం అయ్యింది. ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా గత సంవత్సరం విడుదల కాగా అదే చివరి చిత్రం అయ్యింది. మరి ఈ బ్యూటీ మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

1981 సంవత్సరంలో జన్మించిన అనుష్క.. గత 15 ఏళ్ల క్రిందట ‘సూపర్’ సినిమాతో పరిచయమై టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. వెండితెరపై స్వీటీ అందం, అభినయం చూసి అన్ని భాషా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత యంగ్ హీరో ప్రభాస్‌తో అనుష్క డేటింగ్ చేస్తోందని, ఆయనతో పెళ్లి కూడా కన్ఫమ్ అయిందనే వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఈ వార్తలను అటు ప్రభాస్, ఇటు అనుష్క ఇద్దరూ ఖండించడంతో వాటికి ఫుల్‌స్టాప్ పడింది.

గ్లామర్ డోస్ తో అడుగుపెట్టిన ఈ భామ తెలుగు,తమిళ భాషలతో పాటు హిందీలో కూడా 5,6 భారీ క్రేజీ చిత్రాల్లో ఛాన్స్ లు వస్తే అనుష్క వదులుకున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్, పైగా పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ కానున్న క్రేజీ చిత్రాల్లో పొన్నియిన్ సెల్వన్`మూవీ లో అనుష్కను అడిగారట.. కానీ దానికి ఆమె నో చెప్పారంట. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ యానిమేటెడ్ పాత్రతో రూపొందించిన కొచ్ఛాడయాన్ సినిమాలో ..అనుష్క శెట్టి కాల్షీట్ల కారణంగా ఈ చిత్రాన్ని సున్నితంగా వదిలేయడంతో ఆ ప్లేస్ లో దీపికా పదుకొనే చేశారు. ప్రస్తుతం హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న అసురన్ తెలుగు రీమేక్ నారప్ప లో చేయమని అనుష్కను అడిగితె నో చెప్పారంట. ఇక నిశ్శబ్ధంలో చేస్తున్న సమయంలో కాల్షీట్ల సమస్య వలన నారప్ప ఆఫర్ ను అనుష్క వదులుకుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news