Moviesకీర్తి సురేష్‌.. ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..??

కీర్తి సురేష్‌.. ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..??

కీర్తి సురేష్‌.. ఈ పేరుకన్నా ఆమెకి మహానటి అనే పేరు నే కరెక్ట్ గా సెట్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ సినిమా విడుదలైయే వరకు ఆమె ఒక్క హీరోయిన్ గానే తెలుసు కానీ, ఆ సినిమా తరువాత ఆమె మహానటి సావిత్రి నే అయిపోయింది. అంతలా మనల్ని తన నటన తో ఆకట్టుకుంది ఈ కీర్తి పాప. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్‌ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ఇక ఈ సినిమాతోనే ఆమెకు ఉత్తమ జాతీయ నటిగా పురస్కారం లభించింది. కీర్తి సురేష్ గురించి మనకు సినిమాల పరంగానే తెలుసు. కానీ అమె వ్యక్తిగత విషయాలు గురించి మనలో చాలా తక్కువ మందికే తెలుసుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం..

మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్‌ స్టేటస్ సొంతం చేసుకున్న ఈ కీర్తి పాప..తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే మీరు షాక్ అయ్యిపోవ్వడం ఖాయం. కీర్తి సురేష్‌.. మలయాళం ఫిలిం ప్రోడ్యుసర్ సురేష్ కుమార్,నటి మేనకల కూతురు. ఈమె తమిళనాడులోని చెన్నైలో 1992అక్టోబర్ 17న జన్మించింది. కీర్తి సురేష్.. కేరళ తిరువనంతపురం కేంద్రీయ విద్యాలయం, తమిళనాడు పారెల్ కాలేజీలో చదువు పూర్తి చేసి .. ఫ్యాషన్ డిజైన్ లో బిఎ పూర్తిచేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో 2000లో ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తరువాత స్టడీస్ మీద దృష్టి పెట్టింది. స్టడీస్ పూర్తయ్యాక 2013లో గీతాంజలి మలయాళం మూవీలో నటించింది. ఈ సినిమాకు 37లక్షల 60వేలు రెమ్యూనరేషన్ తీసుకుందట. ఆమెకు తమిళ నటులు విజయ్, సూర్య, హీరోయిన్ విద్యాబాలన్ అంటే చాలా ఇష్టమట.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రంగ్‌ దే’తో ప్రేక్షకుల్ని ఇటీవల పలకరించిన కీర్తి.. ప్రస్తుతం రజనీకాంత్‌ ‘అన్నాత్తే’, మహేశ్‌ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాల్లో నటిస్తోంది. నాయికా ప్రాధాన్య చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ కీర్తి తన టాలెంట్‌ నిరూపించుకుని వరుస సినిమాలతో దూసుకుపోతోంది.’మహానటి’ చిత్రంలో నటించడమే కాదు తన ప్రతిభతో మహానటి అనిపించుకుంది కీర్తి సురేశ్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news