Moviesటీఆర్పీలో దుమ్ము రేపిన టాప్ తెలుగు సినిమాలు ఇవే..!

టీఆర్పీలో దుమ్ము రేపిన టాప్ తెలుగు సినిమాలు ఇవే..!

ఇటీవ‌ల చాలా సినిమాలు వెండితెర మీద ఫ‌ట్ అయినా బుల్లితెర మీద సూప‌ర్ హిట్ అవుతున్నాయి. ఇలాంటి స‌రికొత్త సంస్కృతి కార‌ణ‌మైన హీరో నిజంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబే అని చెప్పాలి. మ‌హేష్ న‌టించిన అత‌డు, ఖ‌లేజా లాంటి సినిమాలు నిజంగా వెండితెర మీద ప్లాప్ అయ్యాయి. అయితే ఈ సినిమాలు ఇప్పుడు టీవీలో వ‌చ్చినా జ‌నాలు టీవీల‌కు అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే బుల్లితెర మీద దుమ్మురేపి టాప్ టీఆర్పీలు ద‌క్కించుకున్న తెలుగు సినిమాల గురించి తెలుసుకుందాం..!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కెరీర్ బ్లాక్ బ‌స్ట‌ర్ రంగ‌స్థ‌లం 19.5 టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఇక కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌హాన‌టి 20.21 టీఆర్పీ రేటింగ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – కొరటాల శివ జనతా గ్యారేజ్ 20.69 టిఆర్పి రేటింగ్ సాధించాయి. ఇక రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గీత‌గోవిందం 20.8 – వ‌రుణ్ తేజ్ ఫిదా 21.31 టీఆర్పీ సాధించ‌గా.. టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ బాహుబ‌లి 21.54 – బ‌న్నీ డీజే 21.7 టీఆర్పీ సొంతం చేసుకున్నాయి.

ఇక బాహుబలి రెండో భాగానికి 22.7 – మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి 23.4 టిఆర్పీ వ‌చ్చాయి. ఏదేమైనా బుల్లితెర‌పై తిరుగులేని టీఆర్పీలు అంటే మహేష్ బాబుకే అని చెప్పాలి. అత‌డు, ఖ‌లేజా సినిమాలు ఇప్పుడు టీవీల్లో వ‌చ్చినా కూడా 5 – 7 టీఆర్పీలు వ‌స్తుంటాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news