Moviesటాప్ దర్శకుల రెమ్యునరేషన్ లిస్ట్.. చూస్తే కళ్ళు జిగేల్..!!

టాప్ దర్శకుల రెమ్యునరేషన్ లిస్ట్.. చూస్తే కళ్ళు జిగేల్..!!

సాధారణంగా మనం ఏదైనా సినిమా హిట్ అయితే ఏమంటాం. అరె ఆ సినిమాలో హీరో డ్యాన్స్ భళే చేసాడ్రా.. లేదా ఆ హీరోయిన్ యాక్టింగ్ బాగా చేసింది అని అంటాం. అంతేకాని ఆ మూవీ డైరెక్ట్ చేసిన దర్శకుడిని లైట్ తీసుకుంటాం. కానీ, హీరో-హీరోయిన్ ని అలా చేయమని చెప్పి..ఆ సినిమా కోసం కష్టపడిన డైరెక్టర్ ని పెద్దగా పట్టించుకోం. అసలు ఒక సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్టర్ పాత్ర చాలా ముఖ్యం.

తెలుగులో చాలా మంది టాలెంటడ్ దర్శకులు ఊన్నారు. ఇక ప్రస్తుతం అందరి చూపు పెద్ద దర్శకుల పైనే ఉంది. వారు తీసుకునే రెమ్యునరేషన్ ఎంత అయ్యి ఉంటుందనేది అందరిలో ఒక ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఇప్పుడు వాళ్లలో టాప్ డైరెక్టర్ల పారితోషికం గురించి ఒక్కసారి చూద్దామా.

ఎస్ఏస్.రాజమౌళి :

బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ స్థాయిని పెంచాడు కాబట్టి మొదటగా ఈ దర్శకుడే నెంబర్ వన్ అని చెప్పవచ్చు. తెలుగు దర్శకుల్లో ఇప్పుడు టాప్ లీగ్ లో ఉన్నాడు ఎస్ ఎస్ రాజమోళీ. ఈయన ఒక్కొ సినిమాకి 25-30 కోట్లు తీసుకుంటున్నారట. ఇక RRRకు షేర్స్ ద్వారానే డీలింగ్స్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. అంటే సినిమా బిజినెస్ బట్టి ఆ సినిమాకు 100కోట్లు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

త్రివిక్రమ్ శ్రీనివాస్:

అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా భారీగా నే పారితోషకం పుచ్చుకుంటున్నారు. అల.. వైకుంఠపురములో హిట్టయ్యింది కాబట్టి 20కోట్ల వరకు అడిగే డిమాండ్ ఉంది. ఇక మహేష్ బాబు సినిమాకు అంతకంటే ఎక్కువ వచ్చేలా లాభాల్లో వాటా అడిగే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలో టాక్.

సుకుమార్:


రంగస్థలం తో బాక్సాఫీస్ హిట్ అందుకోవడంతో పారితోషకాని భారీగా పెంచేసాడు ఈ రొమాంటిక్ డైరెక్టర్. బన్నీతో చేస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప రెండు బాగల కోసం 30కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు సమాచారం.

కొరటాల శివ:


వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన నాలుగు సినిమాలూ సూప‌ర్ హిట్లుగా అందుకున్నాయి. ఇక ప్ర‌స్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఆచార్యకు రూ.13 కోట్లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

అనిల్ రావిపూడి :


హిట్స్ తో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి F2 సినిమాతో తన మార్కెట్ ను మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతం చేస్తున్న F3 కోసం 10కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.

శేఖర్ కమ్ముల:


శేఖర్ కమ్ముల ప్రస్తుతం లవ్ స్టొరీ సినిమాకు 10కోట్లకు పైగానే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ధనుష్ తో చేయబోయే బిగ్ బడ్జెట్ సినిమాకు కూడా అంతకంటే ఎక్కువ రావచ్చని సమాచారం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news