Newsస‌చిన్ 6 ఏళ్ల పెద్ద‌యిన అంజిలిని పెళ్లాడితే... కూతురు రెండేళ్ల చిన్నోడితో...

స‌చిన్ 6 ఏళ్ల పెద్ద‌యిన అంజిలిని పెళ్లాడితే… కూతురు రెండేళ్ల చిన్నోడితో డేటింగ్ ?

భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స‌చిన్ టెండుల్క‌ర్ వ‌య‌స్సులో త‌న‌కంటే ఆరే ఏళ్లు పెద్ద‌ది అయిన అంజ‌లిని ప్రేమించి పెళ్లాడాడు. స‌చిన్ స్టార్ క్రికెట‌ర్‌గా కొన‌సాగుతోన్న టైంలో ఆరేళ్లు పెద్ద‌ది అయిన అంజలిని పెళ్లాడ‌డం పెద్ద సంచ‌ల‌నం. అయితే ఇప్పుడు స‌చిన్ రూట్లోనే సచిన్ కుమార్తె సారా కూడా వెళుతోంది. ఈ విష‌యంలో ఆమె త‌న త‌ల్లి అంజ‌లిని ఆద‌ర్శంగా తీసుకుందో ఏమో గాని.. త‌న‌క‌న్నా వ‌య‌స్సులో రెండేళ్లు చిన్న అయిన ఓ క్రికెట‌ర్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్టు కొంత కాలంగా వార్త‌లు గుప్పుమంటున్నాయి.

సచిన్ కూతురు సారా క్రికెట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్టు టాక్ ? ఐపీఎల్‌లో శుభ్‌మన్‌ మెరిసిన ప్రతిసారీ సారా అతడి ఫొటోలకు లవ్‌ ఎమోజీలతో ఆమె ప్రేమ బ‌య‌ట పెట్టుకుంటోంది. ఓ సారి క్యాచ్ మిస్ చేస్తే ఆ ఫొటో కూడా పెట్టి వెల్ ట్రై అని పెట్టింది. అయితే వ‌య‌స్సులో సారా గిల్ కంటే రెండేళ్లు పెద్ద‌ది. గిల్ వ‌య‌స్సు 21 అయితే సారాకు 23 సంవ‌త్స‌రాలు. ఇక ప్రేమ పుట్టాలే కాని… వ‌య‌స్సుతో ప‌నేముంద‌ని నెటిజ‌న్లు వీరి ప్రేమ‌కు స‌పోర్ట్ చేస్తున్నారు.

సారా అమ్మ అంజ‌లి సచిన్ కంటే పెద్దది కాదా ? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇక గిల్‌ సోదరిలు షానీల్‌ గిల్‌, సిద్ధును కూడా సారా ఇన్ స్టాలో అనుసరిస్తుండడంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ ఒక్క‌టే పుకార్లు వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news