Moviesఈ యాంకర్ మొదటి పారితోషికం ఎంతో తెలుసా.. అసలు నమ్మలేరు..!!

ఈ యాంకర్ మొదటి పారితోషికం ఎంతో తెలుసా.. అసలు నమ్మలేరు..!!

బుల్లితెర పై మేల్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఫీమేల్ యాంకర్స్ లో సుమ ఎంతటి పాపులార్టీ తెచ్చుకుందో మేల్ యాంకర్స్ లో రవి కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. మేల్ యాంకర్స్‌లో ప్రదీప్ క్లాస్ ఫాలోయింగ్ సంపాదిస్తే.. మాస్ మహారాజా అనిపించుకున్నాడు రవి. పటాస్ లాంటి షోలను ఏళ్ల పాటు నడిపించిన ఘనత మనోడి సొంతం. అంతేకాదు మాస్ యాంకరింగ్‌తో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

మేల్ యాంకర్లలో రవికి సెపరేట్ గుర్తింపు ఉంది. కాస్త బోల్డ్‌ పంచ్‌‌లు వెయ్యడం, లేడీ యాంకర్లతో మంచి కెమిస్ట్రీతో ఆకట్టుకోవడం రవి స్టైల్. 2010లో మా మ్యూజిక్ టీవీలో లవ్ జంక్షన్ షో తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన రవి ఆతర్వాత వరుస షోస్ తో బిజీ అయ్యాడు. ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు అవకాశాలు అందుకున్నాడు.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు రవి. ప్రస్తుతం ఈయన పలు షో లలో బిజీగా ఉండగా తాజాగా మరో షో లో ఆర్టిస్ట్ అషు రెడ్డితో కలిసి యాంకరింగ్ చేస్తున్నాడు. ఇక ఈమధ్య ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. తొలిసారి లైవ్ షోలో ఎపిసోడ్ కి 250రూపాయలు తొలి పారితోషికంగా అందుకున్నానని చెప్పాడు. అంతేకాదు, క్రికెటర్ అవ్వాలని కోరుకున్నప్పటికీ కాలేకపోయానని యాంకర్ రవి చెప్పాడు.

స్టార్ మాలో వచ్చిన ‘సమ్‌థింగ్‌ స్పెషల్’‌ అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న జోడీ రవి – లాస్య. అయితే బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నా రవి-లాస్య జోడీకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. టీఆర్పీ రేటింగ్‌లోనూ వీరిద్దరి కాంబో హిట్‌ పెయిర్‌గా నిలిచింది. రవి-లాస్య జోడీకి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారంటే వీరిద్దరి కాంబినేషన్‌ ఎంతపెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై క్రేజీ జంటగా పిలిపించుకున్న లాస్య, రవి. ఒకప్పుడు మంచి ఫేమ్ లో ఉన్న ఈ జంట మంచి ఫాలోయింగ్ ను అందుకున్నారు.

అయితే అంతా బాగానే నడుస్తున్న సమయంలో ఉన్నట్లుండి రవి, లాస్య విడిపోయారు. రవి అని పేరు చెప్పకుండా తనకోసం భార్యకు విడాకులు ఇచ్చి మరి ఓ అబ్బాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడంటూ అప్పట్లో లాస్య చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. వీరు బహిరంగంగానే ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. అయితే ఈ ఏడాది మ‌ళ్లీ ఆ ఇద్ద‌రు క‌లిశారు. సంక్రాంతి సంద‌ర్భంగా స్టార్ మాలో ప్ర‌సార‌మైన ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ ప్రోగ్రామ్‌కు ఈ ఇద్ద‌రు హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ప్రస్తుతం బుల్లితెరపై మళ్లీ ఈ జంట ముందుకొచ్చారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news