Moviesబాలీవుడ్‌లో మ‌రో విషాదం... సీనియ‌ర్ న‌టుడు మృతి

బాలీవుడ్‌లో మ‌రో విషాదం… సీనియ‌ర్ న‌టుడు మృతి

బాలీవుడ్‌లో ఈ యేడాది వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క న‌టుల‌ను ఈ యేడాది బాలీవుడ్ కోల్పోగా తాజాగా మ‌రో టాలెంటెడ్ న‌టుడు మృతి చెందారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూశారు. ఆయ‌న కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో బుధ‌వారం తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని సీనియ‌ర్ న‌టి పూజాభ‌ట్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో పాటు ఫ‌రాజ్ కుటుంబానికి ఈ స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు అండ‌గా ఉండాల‌ని కోరారు.

 

ఫ‌రాజ్ ఖాన్ కొద్ది రోజులుగా త‌న ఛాతీ, మెద‌డులో తీవ్ర‌మైన ఇన్‌ఫెక్ష‌న్ సోక‌డంతో బాధ‌ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బెంగ‌ళూరులోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫ‌రాజ్ హాస్ప‌ట‌ల్ ఖ‌ర్చులు కూడా భ‌రించే స్థితిలో లేక‌పోవ‌డంతో పూజా భ‌ట్ చేసిన ట్వీట్‌కు స‌ల్మాన్ ఖాన్ స్పందించారు. స‌ల్మాన్ సాయం చేసినా కూడా ఫ‌రాజ్ ఈ లోకం విడిచి వెళ్లిపోవ‌డం బాధాకరం.

 

కాగా ఫ‌రాజ్ ఖాన్ 1990లో బాలీవుడ్‌లో నటుడిగా ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫరేబ్, మెహందీ, మైనే ప్యార్ కియా వంటి చిత్రాల్లో  తన నటనతో ఆకట్టుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news