Moviesమ‌ళ్లీ మ‌ర‌ద‌లు పిల్ల‌తో రొమాన్స్‌కు ప‌వ‌న్ సై సై..!

మ‌ళ్లీ మ‌ర‌ద‌లు పిల్ల‌తో రొమాన్స్‌కు ప‌వ‌న్ సై సై..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ర‌ద‌లు పిల్ల ఎవ‌ర‌నుకుంటున్నారా ?  అత్తారింటికి దారేది సినిమా త‌ర్వాత ప‌వ‌న్ అత్త‌గా న‌దియా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. అలాగే ప‌వ‌న్ మ‌ర‌ద‌లు పిల్ల‌గా ప్ర‌ణీత సుభాష్ సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. అప్ప‌టి నుంచి న‌దియా, ప్ర‌ణీత‌ల‌ను ప‌వ‌న్ వార్త‌ల్లో రాసేట‌ప్పుడు ప‌వ‌న్ అత్త‌, ప‌వ‌న్ మ‌ర‌ద‌లు పిల్ల అని రాయ‌డమే అల‌వాటుగా మారింది. ఇక ప‌వ‌న్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్ వ‌కీల్‌సాబ్ సినిమా త‌ర్వాత క్రిష్ డైరెక్ష‌న్‌లో ఓ పీరియాడిక‌ల్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ జాక్వెలైన్ పెర్నాండెజ్ పేరు వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఓ యువ‌తి ప‌వ‌న్‌తో ప్రేమ‌లో ప‌డుతుంద‌ట‌. ఆ యువ‌తికి ప‌వ‌న్ ప‌క్క‌న ఓ డ్యూయెట్ సాంగ్ కూడా ఉంటుంద‌ట‌. ప‌వ‌న్‌ను ప్రేమించే యువ‌తి పాత్ర‌లో ప్ర‌ణీత న‌టిస్తుంద‌ని.. చాలా రోజుల త‌ర్వాత ప్ర‌ణీత మ‌రోసారి త‌న ప‌వ‌న్ బావ‌తో జోడీ క‌ట్ట‌బోతోంద‌న్న వార్త‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

 

ఏఎం. ర‌త్నం నిర్మిస్తోన్న ఈ సినిమాకు విరూపాక్ష టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ రెండు సినిమాల త‌ర్వాత ప‌వ‌న్ సురేంద‌ర్‌రెడ్డి, హ‌రీష్ శంక‌ర్ సినిమాల‌తో పాటు మ‌ళ‌యాళ రీమేక్ మూవీని సాగ‌ర్ చంద్ర డైరెక్ష‌న్‌లోనూ న‌టిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news