Moviesనాలుగు సినిమాలు లైన్లో పెట్టిన బాల‌య్య‌... డీటైల్స్ ఇవే..!

నాలుగు సినిమాలు లైన్లో పెట్టిన బాల‌య్య‌… డీటైల్స్ ఇవే..!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బీబీ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య వ‌రుస పెట్టి సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత సీనియ‌ర్ డైరెక్ట‌ర్ బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ సినిమాకు ఓకే చెప్పాడంటున్నారు. వీరిద్ద‌రికి ఎంత హిట్ కాంబినేష‌నో తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయంటున్నారు. ఫుల్ ఫామ్‌లో ఉన్న సాయిమాధ‌వ్ బుర్రా ఈ సినిమా కోసం స్క్రిఫ్ట్‌, డైలాగ్ వెర్ష‌న్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడ‌ట‌.

ఇక బాల‌య్య – పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో మ‌రో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్లో పైసా వ‌సూల్ సినిమా వ‌చ్చింది. సినిమా ప్లాప్ అయినా పూరి మేకోవ‌ర్‌, బాల‌య్య యాక్టింగ్ ఈ సినిమా కొత్తగా ఉంద‌న్న టాక్‌కు దోహ‌ద‌ప‌డ్డాయి. ఏదేమైనా బాల‌య్య వ‌రుస పెట్టి సినిమాల‌ను లైన్లో పెట్టుకుంటూ పోతున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఈ సినిమాల‌ను బాల‌య్య పినిష్ చేస్తాడ‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news