Moviesజ‌బ‌ర్ద‌స్త్ అవినాష్ ల‌వ్‌స్టోరీలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా..!

జ‌బ‌ర్ద‌స్త్ అవినాష్ ల‌వ్‌స్టోరీలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా..!

జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా చాలా త‌క్కువ టైంలోనే మంచి పాపులార్ అయ్యాడు అవినాష్‌. ఈ క్ర‌మంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లోకి వ‌చ్చాడు. అప్ప‌టి వ‌ర‌కు బిగ్‌బాస్ హౌస్‌లో లేని ఎట్రాక్ష‌న్ అవినాష్ ఎంట్రీతో వ‌చ్చింది. అవినాష్ చేస్తోన్న కామెడీకి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అవినాష్ వ‌చ్చాకే బిగ్‌బాస్ రేటింగ్‌లు కాస్త పుంజుకున్నాయ‌నే చెప్పాలి. అయితే అవినాష్‌కు ల‌వ్ బ్రేక‌ప్ స్టోరీ ఉంద‌ట‌.

 

ఈ విష‌యాన్ని అవినాష్ త‌మ్ముడు అజ‌య్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అవినాష్ పదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాడ‌ట‌. ఆ అమ్మాయి కూడా అవినాష్‌ను ప్రేమించింద‌ట‌. అవినాష్ ఆ అమ్మాయినే చూస్తూ ఉండేవాడ‌ట‌. ఆ టైంలో అవినాష్‌, అజ‌య్ ఇద్ద‌రూ ఒకే హాస్ట‌ల్లో ఉండేవార‌ట‌. అవినాష్‌ను అజ‌య్ డ‌బ్బులు అడిగినా లేవ‌ని చెప్పేవాడ‌ట‌. అయితే అవినాష్ ప్రేమించిన అమ్మాయి మాత్రం అజ‌య్‌కు డ‌బ్బులు ఇవ్వ‌డంతో పాటు ఏ సాయం అయినా చేసేద‌ట‌.

 

అయితే వ‌రుసలు తెలియ‌క త‌న అన్న ప్రేమించిన అమ్మాయిని అజ‌య్ అక్కా అని పిలిచేవాడ‌ట‌. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమెతో అవినాష్‌కు బ్రేక‌ప్ అయ్యింద‌ట‌. ఆ త‌ర్వాత పూర్తిగా కెరీర్‌పై కాన్‌సంట్రేష‌న్ చేసిన అవినాష్ జ‌బ‌ర్ద‌స్త్‌తో స‌క్సెస్ అయ్యి ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నాడు. ఇక త‌న అన్న‌ను బిగ్‌బాస్ 4 విజేత‌గా చూడాల‌ని అనుకుంటున్నాన‌ని అజ‌య్ చెపుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news