Moviesబృందావ‌నం రిజెక్ట్ చేసి.. బ్లాక్ బ‌స్ట‌ర్ మిస్ అయిన స్టార్ హీరో...

బృందావ‌నం రిజెక్ట్ చేసి.. బ్లాక్ బ‌స్ట‌ర్ మిస్ అయిన స్టార్ హీరో ఎవ‌రో చూడండి..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన బృందావ‌నం 2010 అక్టోబర్ 14న ఈ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమా విడుద‌ల అయ్యి ప‌దేళ్లు పూర్త‌య్యాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో ఎన్టీఆర్ కాద‌ట‌. ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ముందుగా దిల్ రాజు వంశీ పైడిప‌ల్లిపై న‌మ్మ‌కంతో ప్ర‌భాస్‌తో మున్నా సినిమా చేశాడు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో ప్ర‌భాస్ న‌మ్మి ఛాన్స్ ఇచ్చినా నిల‌బెట్టుకోలేక‌పోయాన‌ని ఫీల్ అయిన వంశీ బృందావ‌నం క‌థ‌తో ప్ర‌భాస్‌ను క‌లిసి చెప్పాడ‌ట‌.

 

అయితే అప్ప‌టికే ప్ర‌భాస్ డార్లింగ్‌, మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ సినిమాలు క‌మిట్ అవ్వ‌డంతో పాటు ప్ర‌భాస్ ఓటు మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్‌కే వేశాడ‌ట‌. దీంతో దిల్ రాజు ఈ క‌థ‌ను ఎన్టీఆర్‌కు చెప్పించి ఓకే చేయించాడు. అలా ఈ రెండు సినిమాల‌ను దిల్ రాజే నిర్మించగా.. రెండు సూప‌ర్ హిట్ అయ్యాయి. ముందు ఈ ఫ్యామిలీ స్క్రిఫ్ట్ త‌న ఫ్యాన్స్‌కు నచ్చుతుందో ?  లేదో ? అని ఎన్టీఆర్ కూడా డౌట్ ప‌డ్డాడ‌ట‌.

 

 

అయితే రాజ‌మౌళి, క‌ళ్యాణ్ రామ్ ఇద్ద‌రూ కూడా ఈ ఫ్యామిలీ సినిమాను వ‌దులుకోవ‌ద్ద‌ని చెప్ప‌డంతో చివ‌ర‌కు ఓకే చేశాడు. కాజ‌ల్ – స‌మంత హీరోయిన్లుగా తెర‌కెక్కిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా వ‌చ్చి మంచి విజ‌యం సొంతం చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news