Moviesశుభ‌ల‌గ్నం ఆమ‌నిని ఆ ప‌నుల‌కు గెస్ట్ హౌస్‌కు పిలిచిందెవ‌రు...!

శుభ‌ల‌గ్నం ఆమ‌నిని ఆ ప‌నుల‌కు గెస్ట్ హౌస్‌కు పిలిచిందెవ‌రు…!

ఎస్వీ. కృష్ణా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శుభ‌ల‌గ్నం సినిమాలో న‌టించిన ఆమ‌ని ని తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌ట‌కి మ‌ర్చిపోలేరు. ఆ సినిమాలో ఆమ‌ని త‌న భ‌ర్త అయిన జ‌గ‌ప‌తిబాబును డ‌బ్బు పిచ్చితో రోజాకు అమ్ముకోవాల‌ని చూడ‌డం.. రోజా, ఆమ‌ని పోటీ ప‌డి మ‌రీ న‌టించ‌డం లాంటి సీన్లు ఎన్ని సంవ‌త్స‌రాలు అయినా.. ద‌శాబ్దాలు అయినా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల్లో అలా ముద్ర వేశాయి. అప్ప‌ట్లో ఆమ‌ని విక్ట‌రీ వెంకటేష్‌, నాగార్జున‌, జ‌గ‌ప‌తిబాబు, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ లాంటి స్టార్ హీరోల ప‌క్క‌న నటించి ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది.

Shubhalagnam Movie || Aamani Phone Talking Scene || Jagapati Babu, Aamani,  Roja - YouTube

మ‌ధ్యలో వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొద్ది రోజుల పాటు ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ బుల్లితెర‌పై, వెండితెర‌పై సంద‌డి చేస్తోంది. తాజాగ ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమ‌ని పాల్గొని త‌న సినీ ప్ర‌యాణానికి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాన‌ని చెప్పిన ఆమ‌ని ఇండ‌స్ట్రీలో తాము పెద్ద‌లం అని చెప్పుకుని తిరిగే కొంద‌రు త‌న‌ను కూడా లైంగీకంగా వాడుకోవాల‌ని చూశార‌ని ఆమె బాంబు పేల్చింది.

Aamani | Singavarapu

అయితే తాను మాత్రం అవ‌కాశాల కోసం ఎలాంటి క‌మిట్‌మెంట్లు ఇవ్వ‌లేద‌ని చెప్పింది. అయితే నిజంగా సినిమా రంగంలో మంచి పేరు ప్ర‌ఖ్యాతుల కోసం చూసే ఏ ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఇలాంటి వేధింపుల‌కు పాల్ప‌డ‌ర‌ని ఆమె చెప్పింది. కొద్ది రోజుల క్రితం సీనియ‌ర్ న‌రేష్ న‌టించిన చంద‌మామ క‌థ‌లు సినిమాలో న‌టించిన ఆమ‌ని ప్ర‌స్తుతం కార్తీకేయ‌కు త‌ల్లిగా ఓ పాత్ర‌లో న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news