Newsవైర‌ల్: ప్ర‌ముఖ ఛానెల్ ఉద్యోగినిపై స్టార్ ర‌చ‌యిత లైంగీక వేధింపులు...

వైర‌ల్: ప్ర‌ముఖ ఛానెల్ ఉద్యోగినిపై స్టార్ ర‌చ‌యిత లైంగీక వేధింపులు…

ప్ర‌ముఖ కోలీవుడ్ ర‌చ‌యిత వైర‌ముత్తుపై సింగ‌ర్ చిన్న‌యి కొద్ది రోజులుగా మీటు ఉద్య‌మంలో భాగంగా తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఆయ‌న త‌న‌ను లైంగీకంగా వేధించాడ‌ని చిన్మ‌యి ఇప్ప‌టికే ప‌లుమార్లు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వైర‌ముత్తు ఓ ప్ర‌ముఖ త‌మిళ ఛానెల్ ఉద్యోగినిని కూడా లైంగీకంగా వేధించేవార‌ని.. త‌నను చెన్నైలోని ఓ ప్రాంతానికి రావాలంటే వేధించిన విష‌యాన్ని ఆమె చిన్న‌యితో పంచుకున్నారు. ఈ ఆవేద‌న‌ను చిన్మ‌యి సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించ‌డంతో ఇది వైర‌ల్ అవుతోంది.

 

తాను విదేశీ టూర్‌లో ఉన్న‌ప్పుడే వైర‌ముత్తు త‌న‌ను ఆయ‌న గ‌దికి రావాలంటూ ఓ మ‌హిళ‌తో క‌బురు పంపాడ‌న్న విష‌యంపై గ‌తంలోనే ఆరోప‌ణలు చేసింది. అయితే ఇప్పుడు ఏ మ‌హిళా ఉద్యోగిని అయితే ఆరోప‌ణ‌లు చేసిందో ఆమె పంపిన స్క్రీన్ షాట్లు బ‌య‌ట పెట్టిన చిన్మ‌యి ఆమె పేరు మాత్రం చెప్ప‌లేదు. త‌న పేరు బ‌య‌ట పెట్ట‌వ‌ద్ద‌ని ఆ మ‌హిళ విజ్ఞ‌ప్తి చేసింద‌ని చిన్మ‌యి చెప్పింది.

 

ఇక స‌ద‌రు మ‌హిళ చిన్మ‌యికి పంపిన మెసేజ్‌లో తాను కాలేజ్ విద్యార్థినిగా ఉన్న‌ప్పుడు ఓ పుస్త‌కం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో వైర‌ముత్తు ఆటోగ్రాఫ్ తీసుకున్నాన‌ని.. అందులో ఆయ‌న త‌న ఫోన్ నెంబ‌ర్ కూడా రాశార‌ని.. త‌న‌ది చిన్న వ‌య‌స్సు కావ‌డంతో ఫోన్ నెంబ‌ర్ ఎందుకు ఇచ్చారో త‌న‌కు అర్థం కాలేద‌ని పేర్కొంది. ఆ త‌ర్వాత తాను త‌మిళ్ ఛానెల్లో చేరిన‌ప్పుడు ఆయ‌న నా ఫోన్ నెంబ‌ర్ తీసుకుని వేధించ‌డంతో తాను షాక్‌కు గుర‌య్యాన‌ని ఆ మ‌హిళ సందేశంలో తెలిపింది.

 

కేవ‌లం గంటలోనే 50 సార్లు ఫోన్ చేసి వేధించ‌డంతో చివ‌ర‌కు ఆ విష‌యాన్ని తాను ఛానెల్ దృష్టికి తీసుకు వెళ్ల‌డంతో వారు వైర‌ముత్తు భార్య‌కు చెప్ప‌గా ఆమె స్వ‌యంగా త‌న మొగుడికి వార్నింగ్ ఇచ్చింద‌ని పేర్కొంది. ఇప్పుడు చిన్మ‌యి షేర్ చేసిన ఈ మెసేజ్ బాగా వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news