Politicsహీరోయిన్‌తో టీడీపీ నేత బొండా ఉమా... సోష‌ల్ వైర‌ల్‌

హీరోయిన్‌తో టీడీపీ నేత బొండా ఉమా… సోష‌ల్ వైర‌ల్‌

విజ‌య‌వాడ టీడీపీ రాజ‌కీయాల్లో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఓ వెలుగు వెలిగాడు. ప్ర‌త్య‌ర్థుల‌పై ప‌దునైన పంచ్‌లు, అస్త్రాల‌తో విరుచుకు ప‌డేవారు. రేయ్ పాతేస్తా అనే ప‌దునైన డైలాగ్‌లు ఎవ్వ‌రూ మ‌ర్చిపోరు. ఇప్పుడు పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డంతో ఉమా మ‌రి అంత దూకుడుగా వెళ్లే ప‌రిస్థితి లేదు. అయితే ఉమాపై తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ అంశం బాగా వైర‌ల్ అవుతోంది. ఓ ప్ర‌ముఖ హోట‌ల్ నుంచి హీరోయిన్‌తో క‌లిసి వ‌స్తోన్న ఉమా అన్న పోస్ట్ బాగా ట్రెండ్ అవుతోంది.

 

త‌న ప్ర‌త్య‌ర్థులే ఈ ప్ర‌చారం చేస్తున్నారంటూ ఉమా హైద‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ పోస్టింగ్ వ‌ల్ల త‌న‌పై అన‌వ‌స‌ర అపోహ‌లు, ప్ర‌చారం జ‌రిగేందుకు ఛాన్స్ ఉంద‌ని ఉమా పేర్కొన్నారు. అస‌లు ఆ హీరోయిన్ ఎవ‌రో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులే ఈ కుట్ర‌కు పాల్ప‌డ్డారంటూ ఆయ‌న ఆరోపిస్తున్నారు. ఇక బొండా పోలీసుల‌కు ఫిర్యాదు చేసే లోప‌లే ఈ ప్ర‌చారం సోష‌ల్ మీడియా పుణ్య‌మా అంటూ బాగా వైర‌ల్ అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news