Moviesబ్రేక‌ప్ బాధ‌లో సాయితేజ్‌... ఆ హీరోయిన్ వ‌ల్లేనా...!

బ్రేక‌ప్ బాధ‌లో సాయితేజ్‌… ఆ హీరోయిన్ వ‌ల్లేనా…!

మెగా మేన‌ళ్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్ ఇటీవ‌లే వ‌రుస ప్లాపుల త‌ర్వాత చిత్ర‌ల‌హ‌రి, ప్ర‌తిరోజు పండ‌గే సినిమాల‌తో కాస్త పుంజుకుంటోంది. సాయి గ‌తంలో ఓ హీరోయిన్‌తో వ‌రుస‌గా సినిమాలు చేసిన‌ప్పుడు ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నాడ‌న్న గుస‌గుస‌లు వ‌చ్చాయి. ఆ గుస‌గుస‌ల సంగతేమో గాని ఇప్పుడు సాయి నిజంగానే బ్రేక‌ప్ బాధ‌తో ఉన్నాడ‌ట‌. మ‌నోడికి ఓ హీరోయిన్‌తో బ్రేక‌ప్ అయ్యింది. ఈ విష‌యం సాయి స్వ‌యంగా చెప్పాడు.

 

అస‌లు సంగ‌తేంటంటే సాయి న‌టిస్తోన్న సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. థియేట‌ర్లు ఓపెన్ చేస్తే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు. సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ రావ‌డంతో చిత్ర యూనిట్ కాస్త వెరైటీగా ప్ర‌మోష‌న్లు చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా .. త్వ‌రలో రిలీజ్ అయ్యే మూడో సాంగ్ బ్రేక‌ప్ సాంగ్‌.

 

ఈ సాంగ్ గురించి సాయితేజ్ చెపుతూ.. ఇదో బ్రేక‌ప్ సాంగ్‌. న‌భా న‌టేష్‌తో నాకు బ్రేక‌ప్ అవుతుంది. థ‌మ‌న్ హెల్ఫ్ చేయ‌వా అంటూ కాస్త చ‌మ‌త్కారంతో ట్వీట్ చేశాడు. రియ‌ల్ లైఫ్‌లో ఎలా ?  ఉన్నా రీల్ లైఫ్‌లో మాత్రం న‌భా న‌టేష్ దెబ్బ‌తో మ‌నోడు బ్రేక‌ప్ అయ్యి ప్రేమ పిచ్చోడు అయ్యాడ‌న్న‌మాట‌.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news