Gossipsమెగా హీరో సిక్ అయ్యాడా.. నిజాలేంటి..!

మెగా హీరో సిక్ అయ్యాడా.. నిజాలేంటి..!

మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ తాజా చిత్రం సోలో బ‌తుకే సో బెట‌ర్ అక్టోబ‌ర్ 1వ తేదీ నాటికే ఫస్ట్ కాపీ రెడీ కావాల్సి ఉంది. ఈ సినిమా నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ సినిమా టోట‌ల్ నెగిటివ్ రైట్స్ జీ ఫైవ్ / జీటీవీ / జీ ఫ్లెక్స్ కు ఇచ్చేశారు. సినిమా ఇప్పటికే ఫ‌స్ట్ కాపీ ఇవ్వాల్సి ఉన్నా ఎందుకో కాని లేట్ అయ్యింది. దీనికి కార‌ణాలు ఆరా తీస్తే హీరో సాయి డ‌బ్బింగ్ పార్ట్ ఇంకా బ్యాలెన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

 

సాయి లైట్‌గా సిక్ అయ్యాడ‌ని… ఇంకా కొంచెం షూటింగ్ పార్ట్ కూడా పెండింగ్‌లో ఉంద‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సాయి కొద్ది రోజులుగా ఇంట్లో నుంచి బ‌య‌ట‌కే రావ‌డం లేదంటున్నారు. సాయికి ఇది అనారోగ్యం అన్న‌ది ఖ‌చ్చితంగా తెలియ‌దు కాని.. క‌రోనా పాజిటివ్ ఉంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజ‌మా ?  కాదా ? అన్న దానిపై సాయి క్లారిటీ ఇస్తేనే క‌రెక్టుగా ఉంటుంది.

 

మ‌రోవైపు లాక్‌డౌన్‌లో టాలీవుడ్ యువ హీరోలు వ‌రుస పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే సాయి ధ‌ర‌మ్ కూడా పెళ్లికి రెడీ అవుతోన్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ లోప‌లే సాయి సినిమాకు బ్రేకులు ప‌డ‌డం.. ఆయ‌న సిక్ అయ్యాడ‌న్న వార్త‌లు రావ‌డం జ‌రిగాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news