MoviesR R R కే అన్ని కోట్లు న‌ష్ట‌మా... దాన‌య్య చేతులెత్తేసిన‌ట్టే...!

R R R కే అన్ని కోట్లు న‌ష్ట‌మా… దాన‌య్య చేతులెత్తేసిన‌ట్టే…!

ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్ – రాజ‌మౌళి క్రేజీ కాంబినేష‌న్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఏడు నెల‌ల గ్యాప్ త‌ర్వాత ప్రారంభ‌మైంది. జూన్ నుంచి వ‌చ్చే సంక్రాంతికి వెళ్లిన ఈ సినిమా సంక్రాంతికి కూడా రాద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. చాలా పెద్ద సినిమాలు క‌రోనా వ‌ల్ల ఆరేడు నెల‌లుగా షూటింగ్‌లు క్యాన్సిల్ కావ‌డంతో మోయ‌లేని వ‌డ్డీలు, తెర‌చుకోని థియేట‌ర్లు, జోరు లేని బిజినెస్‌ల‌తో మూలుగుతున్నాయి. చిరు ఆచార్య‌, ప్ర‌భాస్ రాధే శ్యామ్ ఇలా చాలా పెద్ద సినిమాలు ఎప్పుడు సెట్స్ మీద‌కు వెళ‌తాయో ?  తెలియ‌డం లేదు.

 

ఈ అన్ని భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు ఈ షూటింగ్ వాయిదా అన్న‌ది న‌ష్ట‌మే అయినా ఆర్ ఆర్ ఆర్‌కు మాత్రం ఈ న‌ష్టం కోట్ల‌లోనే ఉంటుంద‌న్న‌ది తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ రాజమౌళి మాట‌ల్లోనే 80 శాతం పూర్త‌య్యింది. అయితే గ‌తంలో ఈ సినిమాకు వ‌చ్చిన బిజినెస్ ఆఫ‌ర్లు ఇప్పుడు రావ‌డం లేద‌ట‌. లాక్‌డౌన్ ఓ వైపు, క‌రోనా క‌రాళం మ‌రోవైపు, థియేట‌ర్లు తెరిచినా 50 శాతం కెపాసిటీతో అన్న కండీష‌న్లు ఉన్నాయి. వీటి నేప‌థ్యంలో ఎంత మంచి సినిమా అయినా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌క రార‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది.

 

క‌రోనాకు ముందు ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ స్పీడ్‌గా ప‌రుగులు పెట్ట‌గా ఇప్పుడు చాలా స్లో అయ్యింది. ఓవ‌రాల్‌గా రు. 100 కోట్ల వ‌ర‌కు త‌క్కువ అమౌంట్‌కు డిస్ట్రిబ్యూట‌ర్లు కోడ్ చేస్తున్నార‌ట‌. దాన‌య్య కూడా అంత త‌క్కువ‌కు సినిమాను అమ్మేందుకు ఒప్పుకోవ‌డం లేద‌ట‌.  ప‌రిస్థితి మార‌నంత వ‌ర‌కు ఇలాగే ఉండేలా ఉంది. మ‌ళ్లీ క‌రోనా హ‌డావిడి పూర్తిగా త‌గ్గి థియేట‌ర్లు పూర్తిగా ఓపెన్ అయితేనే రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్‌ను రిలీజ్ చేసేలా ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news