Moviesగుడ్ న్యూస్‌.. రాజ్ త‌రుణ్ పెళ్లి ఎప్పుడో చెప్పేశాడు

గుడ్ న్యూస్‌.. రాజ్ త‌రుణ్ పెళ్లి ఎప్పుడో చెప్పేశాడు

అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన రాజ్ త‌రుణ్ త‌ర్వాత హీరో అయ్యాడు. కెరీర్ ఆరంభంలో మూడు వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఆ త‌ర్వాత రాజ్ క‌థ‌ల ఎంపిక‌లో చేసిన త‌ప్పుల‌తో రేసులో వెన‌క‌ప‌డిపోగా… మిగిలిన యంగ్ హీరోలు రాజ్‌ను దాటుకుని ముందుకు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే రాజ్ త‌రుణ్ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్‌లో ఎదుర్కొన్న క‌ష్టాల‌తో పాటు ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పాడు.

 

రాజ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు డ‌బ్బులు లేక 13 రోజుల పాటు డ‌బ్బుల కోసం పెట్రోల్ బంకులో ప‌నిచేశాన‌ని.. అది కూడా త‌న‌కు క‌ష్టంగా అనిపించ‌లేద‌ని రాజ్ చెప్పాడు. ఆ టైంలో తాను ఇంట్లో డ‌బ్బులు అడిగే ప‌రిస్థితి లేద‌ని.. అందుకే తాను ఎంతో ఇష్టంగా పెట్రోల్ బంకులో ప‌నిచేశాన‌ని రాజ్ చెప్పాడు. ఇక అంధ‌గాడు సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌నుకుంటే ప్లాప్ అవ్వ‌డం రాజ్‌ను ఎంతో బాధ‌పెట్టింద‌ట‌.

 

ఇక పెళ్లిపై రాజ్ హింట్ ఇచ్చేశాడు. తాను మ‌రో రెండు, మూడేళ్ల వ‌ర‌కు పెళ్లి చేసుకోన‌ని.. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడు. తాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా ప్రేమ పెళ్లే చేసుకుంటాన‌ని కూడా రాజ్ త‌రుణ్ చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news