Newsబాలిక‌తో వైసీపీ నేత కామ‌లీల‌లు... క్లైమాక్స్ ఇదే..

బాలిక‌తో వైసీపీ నేత కామ‌లీల‌లు… క్లైమాక్స్ ఇదే..

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ నేత ఓ బాలిక‌ను ప్రేమ పేరుతో లోబ‌రుచుకుని వాడుకున్నాడు. తాను పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించ‌డంతో పాటు ఆమెను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి శారీర‌కంగా వాడుకున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆమెతో త‌న కామ‌కోరిక‌లు తీర్చుకున్న ఆ వైసీపీ నేత ఆమె పెళ్లి చేసుకొమ్మ‌ని చెప్ప‌డంతో మొఖం చాటేశాడు.

 

శ్రీకాకుళం జిల్లా, రాజాం మండలం, పొగిరికి చెందిన కామోదుల రాము అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ నేత‌గా చెలామ‌ణి అవుతున్నాడు. అత‌డు ఓ బాలిక‌ను ప్రేమ పేరుతో వ‌శ‌ప‌రుచుకుని మూడేళ్లుగా శారీర‌కంగా లోబ‌ర్చుకున్నాడు. చివ‌ర‌కు మూడేళ్ల త‌ర్వాత ఆ బాలిక త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని రాముపై ఒత్తిడి చేయ‌డంతో అత‌డు త‌ప్పించుకుని తిరుగుతున్నాడు.

 

ఇప్పుడు పెళ్లి చేసుకోన‌ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నాడంటూ బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ వైసీపీ నేత రాము ఇంటి ఎదుట బైటాయించి బాధితురాలు దీక్షకు దిగింది. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు స్థానికంగా అధికార పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news