Moviesగంగ‌వ్వ ఇంటి కోసం బిగ్‌బాస్ ఎంత ఖ‌ర్చు చేస్తున్నాడంటే...!

గంగ‌వ్వ ఇంటి కోసం బిగ్‌బాస్ ఎంత ఖ‌ర్చు చేస్తున్నాడంటే…!

యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఉన్న అయిదు వారాలు షో చాలా ఆసక్తికరంగా సాగింది. గంగ‌వ్వ ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తుంటుంది. గంగ‌వ్వ నామినేష‌న్లో ఉన్న‌న్ని రోజులు షో మాంచి ర‌క్తిక‌ట్టింది. ఆరు ప‌దుల వ‌య‌స్సులో ఆమెకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌ని బిగ్‌బాస్ ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఆమె మాత్రం హౌస్‌లో ఉండలేక‌పోతున్నాన‌ని చెప్ప‌డంతో ఆమె బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌లేదు.

 

 

ఇక గంగ‌వ్వ ఇళ్లు కట్టుకునేందుకే తాను ఈ హౌస్‌కు వ‌చ్చాన‌ని చెప్పింది. ఇక గంగ‌వ్వ షో మ‌ధ్య‌లో నుంచే బ‌య‌ట‌కు వెళ్ల‌డంతో తానే స్వ‌యంగా ఇళ్లు క‌ట్టించి ఇస్తాన‌ని నాగార్జున స్వ‌యంగా హామీ ఇచ్చాడు. నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్లు నీ ఇంటి ప‌నులు మొద‌ల‌వుతాయ‌ని నాగ్ హామీ ఇచ్చాడు. ఇక నాగ్ హామీ ఇచ్చిన‌ట్టుగానే బిగ్ బాస్ టీం ఆమెకు షోలో పాల్గొన్నందుకు రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డంతో పాటు ఆమె కోసం ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

 

గంగ‌వ్వ ఇంటి క‌సం ఇప్ప‌టికే ప్లాన్ రెడీ అయ్యింది. బిగ్‌బాస్ ఫైన‌ల్ స్టేజ్ టైంకే గంగ‌వ్వ ఇళ్లు కంప్లీట్ చేసి ఆమెకు గిఫ్ట్‌గా ఇవ్వాల‌ని షో నిర్వాహ‌కులు ప్లాన్ చేశార‌ట‌. రు. 15 ల‌క్ష‌ల‌తో ఇళ్లు కట్టిస్తున్నార‌ని.. ఆమె హౌస్‌కు కూడా బిగ్‌బాస్ హౌస్ అని పేరు పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. ఏదేమైనా గంగ‌వ్వ కోరిక మాత్రం బిగ్‌బాస్ తీర్చేస్తున్నందుకు ఆమె ఫుల్ ఖుషీగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news