Moviesటాలీవుడ్‌లో అలా మెరిసి.. ఇలా మాయ‌మైన ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు...

టాలీవుడ్‌లో అలా మెరిసి.. ఇలా మాయ‌మైన ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..!

తెలుగులో అల్ల‌రి న‌రేష్ హీరోగా ఇ. స‌త్తిబాబు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బెట్టింగ్ బంగార్రాజు సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది నిధి. ఈ అమ్మ‌డు వ‌చ్చి రావ‌డంతోనే మంచి ఛాన్స్ కొట్టేసినా.. ఆ త‌ర్వాత ఒక‌టి, రెండు తెలుగు సినిమాల్లో న‌టించి త‌ళుక్కున మాయ‌మైంది. బెట్టింగ్ బంగార్రాజు త‌ర్వాత డ్యాన్స్ మాస్ట‌ర్ అమ్మ రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ర‌ణం -2లో హీరోయిన్‌గా న‌టించింది.  ఈ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అవ్వ‌డంతో ఈ సినిమాపై ఆమె పెట్టుకున్న ఆశ‌లు అడియాస‌లు అయ్యాయి.

 

 

ఆ త‌ర్వాత ఆమె ఏ తెలుగు సినిమాలోనూ న‌టించ‌లేదు.. కాస్త గ్యాప్ తీసుకుని ఓ ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ‌లో ప‌నిచేస్తోన్న సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అత‌డిని ప్రేమ వివాహం చేసుకున్న నిధి.. ప్ర‌స్తుతం వ్యాపార రంగంలో ఫుల్ బిజీ అయ్యింద‌ట‌. సినిమా హీరోయిన్‌గా స‌క్సెస్ కాని నిధి.. వ్యాపారంలో అయినా స‌క్సెస్ అవుతుంద‌ని ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news