Moviesఈ ఫొటోలో మెగాస్టార్‌తో ఉన్న బుడ‌త‌డ ఇప్పుడు క్రేజీ హీరో... గుర్తు...

ఈ ఫొటోలో మెగాస్టార్‌తో ఉన్న బుడ‌త‌డ ఇప్పుడు క్రేజీ హీరో… గుర్తు ప‌ట్టారా…!

టాలీవుడ్‌లో మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన హీరోల్లో సాయి ధ‌ర‌మ్‌తేజ్ ఒక‌డు. త‌క్కువ స‌మ‌యంలోనే మంచి హిట్ల‌తో ఇక్క‌డ నిల‌దొక్కుకున్నాడు. మ‌ధ్య‌లో ఐదారు ప్లాప్ సినిమాలు వ‌రుస‌గా వ‌చ్చినా చిత్ర‌ల‌హ‌రి, ప్ర‌తిరోజు పండగే సినిమాలు సాయి కెరీర్‌కు మంచి ఊపు ఇచ్చాయి. ఇటీవ‌లే సాయిధ‌ర‌మ్ త‌న పుట్టిన రోజు జ‌రుపుకున్నాడు. ఈ క్ర‌మంలోనే మేన‌మామ చిరంజీవి సాయికి బ‌ర్త్ డే విషెష్ చెపుతూ త‌న ఇన్ స్టా ఖాతాలో ఓ ఫొటో కూడా షేర్ చేశాడు.

 

చిన్న‌ప్పుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ను ఎత్తుకుని.. త‌న ఒళ్లో కూర్చోపెట్టుకున్న ఫొటో షేర్ చేసిన చిరు నాటి జ్ఞాప‌కాలు గుర్తు చేసుకోవ‌డంతో పాటు బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు. ఈ ఫొటోను ఇప్పుడు మెగా అభిమానులు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ చేస్తున్నారు. మెగాస్టార్‌తో సుప్రీమ్ హీరో అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆచార్య సినిమాలో న‌టిస్తున్నాడు. ఇక సాయిధ‌ర‌మ్ సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమా చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news