Moviesసోనూసుద్ కంటే వైఎస్‌. భార‌తి ల‌క్ష రెట్లు బెట‌ర్‌... పోసాని సంచ‌ల‌న...

సోనూసుద్ కంటే వైఎస్‌. భార‌తి ల‌క్ష రెట్లు బెట‌ర్‌… పోసాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సోనూసుద్ కంటే వైఎస్‌. భార‌తి చాలా గొప్ప అని సినీన‌టుడు, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ న్యూస్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన పోసాని రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. జ‌గ‌న్ పాల‌న బాగా చేస్తున్నాడ‌ని కితాబు ఇచ్చిన పోసాని జ‌గ‌న్ పుట్టుక ముందు నుంచే వైఎస్ ఫ్యామిలీ ఇన్‌కం ట్యాక్స్ క‌డుతోంద‌ని చెప్పారు. ఇక పులివెందుల‌లో సొంత‌గా స్థ‌లం కొని ఎస్సీ, ఎస్టీల‌కు అక్క‌డ 10 కాల‌నీలు క‌ట్టించిన ఘ‌న‌త వైఎస్ ఫ్యామిలీదే అని పోసాని తెలిపారు.

ఇక వైఎస్. భార‌తి గురించి చెప్పాలంటే సోనూసుద్ కంటే ల‌క్ష‌ రెట్లు గొప్ప అని.. ఆమె సొంత డ‌బ్బుల‌తో ప్ర‌త్యేకంగా స్కూల్స్ ఏర్పాటు చేసి పేద పిల్ల‌ల‌ను చ‌దివిస్తున్నార‌ని పోసాని తెలిపారు. ఇవ‌న్నీ ఎవ‌రైనా చెప్పుకుంట‌రా ? అని పోసాని ప్ర‌శ్నించారు. వైఎస్‌. భార‌తి చేసిన సేవ‌ల‌ను ఆమె ఎప్పుడైనా చెప్పుకున్నారా ? అని కూడా పోసాని వ్యాఖ్యానించారు. ఇక తాను రాజ‌కీయాల్లో తాను ఏనాడు ప‌ద‌వి ఆశించ‌లేద‌ని… ప్రజారాజ్యం సమయంలో కూడా తాను ఎమ్మెల్యే టికెట్ కావాలని అడ‌గ‌లేద‌ని పోసాని చెప్పారు.

ఇక మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం కూడా క‌ర‌క్టే అని.. ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌తో అంద‌రికి న్యాయం జ‌రుగుతుంద‌న్న పోసాని జ‌గ‌న్ అమ‌రావ‌తి రైతుల‌కు కూడా న్యాయం చేస్తార‌ని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టడం మంచి నిర్ణయం అన్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news