Moviesహీరోయిన్‌ను పెళ్లాడిన యంగ్ హీరో

హీరోయిన్‌ను పెళ్లాడిన యంగ్ హీరో

కోలీవుడ్ న‌టుడు అర‌వ్ పెళ్లి ఆదివారం చెన్నైలో జ‌రిగింది. అర‌వ్ మ‌రో యువ‌న‌టిని పెళ్లి చేసుకున్నాడు. ఇక అర‌వ్ బిగ్‌బాస్ షోలో పాల్గొని విన్న‌ర్‌గా నిలిచాడు. హౌస్‌లోనే అనేక వివాదాస్ప‌ద అంశాల‌తో వార్త‌ల్లోకెక్కిన అర‌వ్‌కు మ‌రో న‌టి ఓవియ మ‌ధ్య ప్రేమాయ‌ణం పెద్ద వివాదం అయ్యింది. వీరిద్ద‌రు బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా ప్రేమ‌లోనే మునిగి తేలారు. వీరు పెళ్లి చేసుకుంటారు అనుకున్న టైంలోనే విడిపోయారు. ఏదేమైనా అర‌వ్ – ఓవియా ప్రేమాయ‌ణం పెద్ద కాంట్ర‌వ‌ర్సీయే.

Tamil Actor Arav Got Married - Sakshi

ఇక అర‌వ్ తాజాగా న‌టి రాహీను పెళ్లాడాడు. వీరిద్ద‌రి మ‌ధ్య చాలా రోజులుగా ప్రేమాయ‌ణం న‌డుస్తుంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక వీరు ఆదివారం స‌డెన్‌గా పెళ్లి పీట‌లు ఎక్కి అంద‌రికి షాక్ ఇచ్చారు. వీరి పెళ్లి వేడుకకు దర్శకుడు కేఎస్‌ రవికుమార్, గాయత్రి రఘురాం, నటి బిందుమాధవి, నటుడు హరీష్‌ కల్యాణ్‌ విచ్చేసి నవ దంపతులకు ఆశీస్సులు అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news