Gossipsఆదిపురుష్‌లో విశ్వామిత్రుడు టాలీవుడ్ హీరోనే..!

ఆదిపురుష్‌లో విశ్వామిత్రుడు టాలీవుడ్ హీరోనే..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్టు ఆదిపురుష్‌. బాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాయుడిగా న‌టిస్తుంటే ప్ర‌భాస్‌ను ఢీకొట్టే లంకేశ్‌గా రావ‌ణుడి పాత్ర‌లో బాలీవుడ్ క్రేజీ హీరో సైఫ్ ఆలీఖాన్ పేరు ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. ఇక సీత పాత్ర‌లో కియారా అద్వానీ పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. రామాయ‌ణంలోని ఓ ఘ‌ట్టాని తీసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

కంప్లీట్ వీఎఫ్ఎక్స్‌తో త్రీడీ వెర్షన్‌లో ఈ సినిమాను ప్ర‌జెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఈ సినిమాలో కీల‌క‌మైన విశ్వామిత్రుడి పాత్ర‌ను మ‌న టాలీవుడ్ సీనియ‌ర్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు పోషిస్తున్నార‌ట‌. సినిమా క‌థాంశం ప్ర‌కారం విశ్వామిత్రుడి పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే య‌మ‌దొంగ సినిమాలో య‌ముడిగా మెప్పించిన మోహ‌న్‌బాబు అయితేనే విశ్వామిత్రుడిగా ప‌వ‌ర్ పుల్‌గా ఉంటాడ‌ని భావించిన ఓం రౌత్ ఆయ‌న పేరు సెలెక్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుందంటున్నారు. టీ సీరిస్ భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా మేజ‌ర్ షూటింగ్ శ్రీలంక అడ‌వుల్లో జ‌ర‌గ‌నుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news