Gossipsత‌మ‌న్నాను రిక‌మెండ్ చేసిన బ‌న్నీ... ఎవ‌రి కోస‌మో తెలుసా..!

త‌మ‌న్నాను రిక‌మెండ్ చేసిన బ‌న్నీ… ఎవ‌రి కోస‌మో తెలుసా..!

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఇప్ప‌టికే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ కావ‌డంతో ఆమెకు సినిమా ఛాన్సులు త‌గ్గిపోతున్నాయి. ప్ర‌స్తుతం ఆమె చేత‌లో గోపీచంద్ సిటీమార్ లాంటి సినిమాలు మిన‌హా ఏం లేవు. చివ‌ర‌కు ఆమె తెర‌మీద క‌న‌ప‌డేందుకు ఊరూ పేరూ లేని హీరోల ప‌క్క‌న కూడా న‌టించేందుకు రెడీ అయిపోతోంది. ఇదిలా ఉంటే త‌మ‌న్నా ఇప్పుడు ఓ ఓటీటీ ద్వారా ఓ షో చేసేందుకు రెడీ అవుతోంది. అల్లు అర‌వింద్ ఆహా ప్లాట్ ఫాం ఓ షో చేస్తోంది.

aha - OTT | Movies, Webseries on the App Store

ఈ షోలో త‌మ‌న్నా త‌న మాట‌కారిత‌నంతో ఓ టాక్ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. అల్లు అర‌వింద్ ఈ షో ప్లాన్ చేశాడు. ఇందులో త‌మ‌న్నాను త‌న తండ్రి కోసం స్వ‌యంగా త‌మ‌న్నాను రిక‌మెండ్ చేసిన‌ట్టు స‌మాచారం. ఆహా డిజిట‌ల్ ప్లాట్ ఫాం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ప‌డుతూ లేస్తూ వ‌స్తోంది. దీనికి మ‌రింత వ్యూయ‌ర్ షిఫ్ తీసుకు వ‌చ్చేందుకు అల్లు అర‌వింద్ టీం అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది.

Movie Acme: Allu Arjun,Tamanna Hot Pics In Badrinath

ఇక ఇప్పుడు త‌మ‌న్నాతో టాక్ షో ప్రారంభించారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే నెల నుండి ఈ టాక్ షో షూటింగ్ మొదలుకానుంది. దసరా నుండి స్పెషల్ గా టెలికాస్ట్ అవుతుందట. మ‌రి త‌మ‌న్నా ఏ రేంజ్‌లో హోస్ట్ చేసి ఈ షోను హిట్ చేస్తుందో ? ఆహాకు మంచి పేరు తెస్తుందో ? చూడాలి.
ఈ టాక్ షోలో అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌, రానా దంపతులు, ర‌వితేజ త‌దిత‌ర స్టార్ హీరోల‌తో పాటు హీరోయిన్లు కూడా పాల్గొనబోతున్నారని టాక్‌..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news