Moviesనేటి నుంచే బిగ్‌బాస్ 4 ప్రారంభం... ఫైన‌ల్ కంటెస్టెంట్లు వీళ్లే...

నేటి నుంచే బిగ్‌బాస్ 4 ప్రారంభం… ఫైన‌ల్ కంటెస్టెంట్లు వీళ్లే…

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ 4 ఎప్పుడెప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా ? అని యావ‌త్ తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. కొంత కాలంగా ప్రేక్ష‌కుల‌ను ఊరిస్తోన్న ఈ షో ఈ రోజు సాయంత్రం నుంచే ప్రారంభం కానుంది. మూడో సీజ‌న్ హోస్ట్ చేసిన కింగ్ నాగార్జునే ఈ సీజ‌న్‌ను కూడా హోస్ట్ చేయ‌నున్నారు. ఇక ఫైన‌ల్ కంటెస్టెంట్ల లిస్ట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ లిస్ట్ ప్ర‌కారం చూస్తే కంటెస్టెంట్లు ఇలా ఉన్నారు.

దేత్త‌డి హారిక ( యూట్యూబ్ స్టార్‌), దేవి నాగ‌వ‌ల్లి ( యాంక‌ర్‌), గంగ‌వ్వ (యూట్యూబ్ స్టార్‌), ముక్కు అవినాష్ ( జ‌బ‌ర్ద‌స్త్ ఫేం), మెనాల్ గుజ్జ‌ర్ (హీరోయిన్‌), అమ్మ రాజ‌శేఖ‌ర్ ( డైరెక్ట‌ర్‌, డ్యాన్స్ మాస్ట‌ర్‌) ఈ షోలో పాల్గోంటున్నారు. ఇందులో వీరితో పాటు క‌రాటే క‌ళ్యాణి ( న‌టి), నోయ‌ల్ (సింగ‌ర్‌), సూర్య కిర‌ణ్ ( డైరెక్ట‌ర్‌), లాస్య (యాంక‌ర్‌), జోర్డ‌ర్ సుజాత (యాంక‌ర్‌), త‌నూజ పుట్ట‌స్వామి ( ముద్ద మందారం ఫేం), స‌య్య‌ద్ సోహైల్ ( టీవీ న‌టుడు), అరియానా గ్లోరీ ( యాంక‌ర్‌),  అభిజిత్ ( లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేం) సీజ‌న్ 4లో సంద‌డి చేయ‌నున్నారు. మొత్తం 105 రోజుల పాటు షో జ‌ర‌గ‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news