Moviesసురేంద‌ర్‌రెడ్డి బ్యాన‌ర్లో అఖిల్ సినిమా.. కొత్త బ్యాన‌ర్ పేరు ఇదే

సురేంద‌ర్‌రెడ్డి బ్యాన‌ర్లో అఖిల్ సినిమా.. కొత్త బ్యాన‌ర్ పేరు ఇదే

అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అఖిల్ – స్టార్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్లో తెర‌కెక్కే క్రేజీ ప్రాజెక్టుపై అనౌన్స్ వ‌చ్చేసింది. చిరంజీవితో సైరా న‌ర‌సింహారెడ్డి లాంటి హిట్ తీసిన సురేంద‌ర్ రెడ్డి గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో మ‌రో విశేషం ఏంటంటే సురేంద‌ర్ రెడ్డి నిర్మాత‌గా కూడా మారుతున్నాడు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క సినిమాను ఏకే ఎంట‌ర్టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం, స‌రెండ‌ర్ 2 సినిమా బ్యాన‌ర్‌పై సురేంద‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Akkineni Akhil : ఆఫీషియల్ : అఖిల్ తో సురేందర్ రెడ్డి!

త‌న సినిమాల్లో హీరోల‌ను సురేంద‌ర్‌రెడ్డి ఎంత స్టైలీష్‌గా ప్ర‌జెంట్ చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఇప్పుడు అస‌లే అంద‌గాడు అయిన అఖిల్‌ను ఇంకెత స్టైలీష్‌గా ప్ర‌జెంట్ చేస్తాడో ? చూడాలి. ఇక అఖిల్ కెరీర్‌లో ఐదో సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. ఈ యేడాదిని ఇప్ప‌టికే సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ బ్లాక్ బస్టర్‌తో ప్రారంభించిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ త‌న వ‌రుస క్రేజీ ప్రాజెక్టుల ప‌రంప‌ర కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాకు నిర్మాతగా రామబ్రహ్మం సుంకర వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా… స‌హ నిర్మాత‌లుగా అజయ్ సుంకర, దీపారెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news