Moviesసినిమాల్లోకి రాక‌ముందు సుధీర్‌బాబు ఆ బిజినెస్ చేసేవాడా...

సినిమాల్లోకి రాక‌ముందు సుధీర్‌బాబు ఆ బిజినెస్ చేసేవాడా…

సూప‌ర్‌స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు సినిమాల్లోకి వ‌చ్చి హీరోగా స‌క్సెస్‌లు కొడుతున్నాడు. ప్ర‌స్తుతం వీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సుధీర్‌బాబు సినిమాల్లోకి వ‌చ్చే ముందు, వ‌చ్చాక కూడా ఎప్పుడూ త‌న మామయ్య సూపర్‌స్టార్‌ కృష్ణ, బావ మహేశ్‌బాబు స‌పోర్ట్ తీసుకోలేదు. సొంతంగా ఎదిగేందుకే ప్ర‌య‌త్నించాడు. ఇక సుధీర్‌బాబు 2006లో కృష్ణ కుమార్తె ఘట్టమనేని ప్రియదర్శిణిని పెళ్లి చేసుకున్నారు. 2010లో ఏ మాయ చేసావె సినిమాతో కెరీర్‌ ఆరంభించారు. ఇందులో ఆయన సమంత సోదరుడిగా నటించారు.

ఆ త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఎస్ఎంఎస్ సినిమాతో హీరో అయ్యాడు. ఈ సినిమా పేరు శివ మ‌న‌సులో శృతి. ఇక సినిమాల్లోకి రాక‌ముందు సుధీర్‌బాబు ఫ్యామిలీది పురుగు మందుల బిజినెస్‌. అలాగే సినిమా డిస్ట్రిబ్యూట‌ర్‌గా కూడా చేశాడు. ఇక పురుగు మందుల బిజినెస్ నుంచి ప‌క్క‌కు వ‌చ్చేందుకే సుధీర్‌బాబు ఈ రంగాన్ని ఎంచుకున్నాడ‌ట‌. ఇక తాను సినిమాల్లోకి వ‌చ్చేముందు కృష్ణ‌, మ‌హేష్‌బాబు రిక‌మెండేష‌న్ తీసుకోలేద‌ట‌. అలా చేస్తే పెళ్లి చేసుకున్నందుకు కట్నం తీసుకున్నట్లే అవుతుంద‌ని… అందుకే తాను అలా చేయ‌లేద‌ని సుధీర్ చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news